కానిస్టేబుల్ అక్రమ సంబంధం.. రట్టుచేసిన మరో కానిస్టేబుల్

conistable illegal affair with another conistable wife
Highlights

కానిస్టేబుల్ భార్యతో మరో కానిస్టేబుల్ అక్రమ సంబంధం కొనసాగించాడు.. 

సూర్యపేట జిల్లా కోదాడలో ఓ  పోలీస్ కానిస్టేబుల్ అక్రమ సంబంధం గుట్టురట్టు అయ్యింది. సూర్యపేట పోలీస్‌ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న  కుర్రాడపు వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్‌  కొంతకాలంగా వరంగల్లో సీఆర్‌పిఎఫ్‌ కానిస్టేబుల్‌గా పని చేస్తున్న ఆతకూరి కొండల్‌రావు భార్య సంధ్యతో అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు.

 భార్య సంధ్య,  తల్లిదండ్రులతో కలిసి కోదాడ శ్రీమన్నారయాణ కాలనీలో  కొండల్‌రావు నివాసముంటున్నాడు. భార్య ప్రవర్తనలో మార్పు గమనించిన  కొండల్‌రావు.. అప్పటి నుంచి నిఘా పెట్టాడు. శనివారం రాత్రి తాను బయటకు వెళ్లి వచ్చే సరికి… తన భార్య సంధ్య, వెంకటేశ్వర్లు ఒకే గదిలో ఉండడాన్ని గమనించి వెంటనే గడియ పెట్టి.. చుట్టుపక్కల వారిని పిలిచి రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకుని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇద్దర్నీ అదుపులోకి తీసుకున్న పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

loader