గదిలో ఉంచి నెల రోజులు లేడీ టెలీకాలర్ పై యజమాని రేప్

Company owner rapes lady Telecaller
Highlights

ఓ లేడీ టెలీకాలర్ పై కంపెనీ యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివిధ నగరాలకు తిప్పుతూ ఆమెపై వరుసగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది.

హైదరాబాద్: ఓ లేడీ టెలీకాలర్ పై కంపెనీ యజమాని అఘాయిత్యానికి పాల్పడ్డాడు. వివిధ నగరాలకు తిప్పుతూ ఆమెపై వరుసగా అత్యాచారం చేస్తూ వచ్చాడు. ఈ సంఘటన హైదరాబాదులో వెలుగు చూసింది.

సంతోష్ నగర్‌కు చెందిన షహన్‌షా షరీఫ్‌(23) రోబోటిక్‌ డిప్లొమా చేశాడు. కొన్నాళ్లు కాలిఫోర్నియాకు వెళ్లి అక్కడ ఓ కంపెనీలో పనిచేసి వచ్చాడు. ఆ తర్వాత సంతోష్ నగర్‌వాసి మహ్మద్‌ ఇర్ఫాన్‌, చంద్రాయణగుట్టలోని గుల్షన్‌ ఇక్బాల్‌ కాలనీకి చెందిన మహ్మద్‌ మినాజ్‌తో కలిసి హబ్సిగూడలో మైరా టెక్నాలజీస్‌ పేరుతో ఓ కంపెనీని ఏర్పాటు చేశాడు. 

నాచారం పరిధిలోని ఓ యువతిని టెలీకాలర్‌గా నియమించుకున్నాడు. ఆఫీస్‌ పనిమీద అంటూ ఆమెను ఇతర రాష్ట్రాలకు తీసుకెళ్లేవాడు. ఈ ఏడాది మార్చి 10న ఆమెను జహనుమ సమీపంలోని వట్టేపల్లికి తీసుకెళ్లి, ఓ అద్దె గదిలో ఉంచి నెల రోజులపాటు అత్యాచారానికి పాల్పడ్డాడు. 

వాటిని ఫొటోలు తీసి, తన వెంట రాకుంటే సోషల్‌ మీడియాలో పెడుతానంటూ బెదిరించి ముంబైతోపాటు పలు రాష్ట్రాలకు తీసుకెళ్లాడు. తన భార్య విడాకులిచ్చిందని, పెళ్లి చేసుకోవాలని ఒత్తిడి చేశాడు. 

తొమ్మిది రోజుల క్రితం బాధితురాలు షరీఫ్‌ నుంచి తప్పించుకుని బాధితురాలు నగరానికి చేరుకుంది. తల్లిదండ్రులతో కలిసి నాచారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో పోలీసులు అత్యాచారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు.

loader