Asianet News TeluguAsianet News Telugu

డ్రగ్స్‌పై కేసీఆర్ సమీక్ష: కీలక నిర్ణయం తీసుకొనే ఛాన్స్


డ్రగ్స్ పై తెలంగాణ సీఎం కేసీఆర్ శుక్రవారం నాడు సమీక్ష నిర్వహించారు. వెయ్యి మందితో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు. డ్రగ్స్ నియంత్రణపై తెలంగాణ సర్కార్ కీలక నిర్ణయాలను తీసుకొనే అవకాశం ఉంది.
 

CM KCR  chair high-level meeting on drug menace
Author
Hyderabad, First Published Jan 28, 2022, 3:51 PM IST

హైదరాబాద్: Drugs పై తెలంగాణ సీఎం KCR  శుక్రవారం నాడు ప్రగతి భవన్ లో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహిస్తున్నారు. ఈ సమావేశంలో కీలక నిర్ణయాన్ని సీఎం  ప్రకటించే అవకాశం ఉంది.  తెలంగాణ DGP , ఎక్సైజ్ శాఖ ఉన్నతాధికారులు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో డ్రగ్స్ అనే పదం వినపడవద్దని కేసీఆర్ పోలీసు అధికారులు ఆదేశించిన విషయం తెలిసిందే.

కేసీఆర్ సమావేశానికి ముందే డీజీపీ Mahender Reddy పోలీస్ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. డ్రగ్స్ నియంత్రణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు.

గత ఏడాది కూడా డ్రగ్స్ అంశానికి సంబంధించి కేసీఆర్ సుదీర్ఘంగా అధికారులతో సమీక్ష నిర్వహించారు.ఈ సమీక్ష తర్వాత ఎక్సైజ్ శాఖాధికారులు గంజాయి సరఫరాపై నిఘాను మరింత తీవ్రం చేశారు అంతేకాదు డ్రగ్స్ సరఫరాపై పోలీస్ శాఖతో పాటు ఎక్సైజ్ శాఖాధికారులు కూడా నిరంతరం అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.

హైద్రాబాద్ సీపీగా సీవీ Anand బాధ్యతలు చేపట్టిన తర్వాత డ్రగ్స్ పై ఉక్కు పాదం మోపుతున్నారు.  దేశంలోని పలు నగరాలకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న టోని అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. టోని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేస్తున్న ఏడుగురు వ్యాపారులను కూడా పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్ కు పంపారు. 

రిపబ్లిక్ డే రోజున కేసీఆర్... డీజీపీ సహా హైద్రాబాద్ నగరంలోని ముగ్గురు సీపీలతో సమావేశమయ్యారు. డ్రగ్స్ విషయమై చర్చించారు. హైద్రాబాద్ డ్రగ్స్ కేసు గురించి సీఎం కేసీఆర్ వివరాలు అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్రంలో డ్రగ్స్ నియంత్రణ కోసం చేపట్టాల్సిన  చర్యల గురించి ఈ సమావేశంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది.

డ్రగ్స్ నియంత్రణ కోసం వెయ్యి మందితో Crime కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయనున్నారు.నార్కోటిక్ అర్గనైజ్డ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం తలపెట్టింది. అంతేకాదు DGP ఆధ్వర్యంలో ప్రత్యేక విభాగం ఏర్పాటు చేస్తామని కేసీఆర్ ప్రకటించారు.దేశంలోని పలు నగరాలకు  డ్రగ్స్ సరఫరా చేస్తున్న మోస్ట్ వాంటెడ్ నైజీరియన్ టోని సహా ఏడుగురు వ్యాపారవేత్తలను హైద్రాబాద్ పోలీసులు ఈ నెల 20వ తేదీన అరెస్ట్ చేశారు. ఈ కేసులో నిందితుల నుండి కీలక సమాచారాన్ని పోలీసులు సేకరించారు. డ్రగ్స్ కేసులో విచారణ సమయంలో హవాలా, మనీలాండరింగ్ జరిగిందని పోలీసులు గుర్తించారు. మనీలాండరింగ్, హవాలాను నిగ్గు తేల్చాలని ఈడీకి హైద్రాబాద్ పోలీసులు ఈ నెల 24న  లేఖ రాశారు.

టోని ప్రధాన అనుచరుడు ఇమ్రాన్ బాబు షేక్ ను గతంలోనే అరెస్ట్ చేశారు. దీంతో  Tony జాగ్రత్తలు తీసుకొన్నారు. ఇమ్రాన్ తో చేసిన చాటింగ్ ను టోని డిలీట్ చేసినట్టుగా హైద్రాబాద్ సీపీ సీవీ ఆనంద్ చెప్పారు.  2013లో  నైజీరియా నుండి టోని ఇండియాకు వచ్చిన టోని డ్రగ్స్ సరఫరా చేస్తున్నాడని సీవీ ఆనంద్ వివరించారు.ముంబైలోని ఈస్ట్ అంథేరిలో  టోని నివసిస్తున్నాడని పోలీసులు చెప్పారు.

టోని 60 మంది యువకులతో డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు. హైద్రాబాద్ లోని ఓయో హోటల్  రూమ్ ను అద్దెకు తీసుకొని డ్రగ్స్ ను సరఫరా చేసేవాడని పోలీసులు  కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.వ్యాపారులకు గ్రాము కొకైన్ ను రూ. 20 వేలకు టోని విక్రయించేవాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు. గత నాలుగేళ్లుగా టోని వద్ద వ్యాపారులు డ్రగ్స్ ను కొనుగోలు చేస్తున్నారని పోలీసులు రిమాండ్ రిపోర్టులో తెలిపారు.

నాలుగు సంవత్సరాల నుంచి  వ్యాపారవేత్త నిరంజన్ జైన్ పెద్ద మొత్తంలో డ్రగ్స్ వాడుతున్నాడు.30 సార్లు టోనీ దగ్గర్నుంచి   నిరంజన్ జైన్ డ్రగ్స్  తేప్పించుకున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు తెలిపారు.వేల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ  నిరంజన్ జైన్ డ్రగ్స్ కు అలవాటు పడ్డాడని పోలీసులు చెప్పారు.పలు ప్రభుత్వ ప్రాజెక్టు పనులను నిరంజన్ కాంట్రాక్టు తీసుకొన్నాడు.నిరంజన్ జైన్ ఇచ్చే పార్టీలో కూడా ఉన్నట్లుగా పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు.

పాత బస్తీ కేంద్రం గా నడుస్తున్న  మసాలా దినుసుల ఫ్యాక్టరీ ఎండిని కూడా ఈ కేసులో అరెస్ట్ చేశారు. మసాలా దినుసుల తో  ప్రతి ఏడాది వందల కోట్ల రూపాయల వ్యాపారం చేస్తున్న ఆనంద్ కూడా ఈ కేసులో అరెస్టయ్యాడు.

మూడు సంవత్సరాల నుంచి టోనీ  గ్యాంగ్ చేత డ్రగ్స్  తెప్పించుకొంటున్నాడు ఆనంద్ అనే వ్యాపారి.ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి శాశవత్ జైన్  కూడా డ్రగ్స్  తీసుకొంటున్నాడని రిమాండ్ రిపోర్టులో పోలీసులు చెప్పారు. హైదరాబాదు తో పాటు ఆంధ్రా లో పెద్ద ఎత్తున రియల్ వ్యాపారాలు చేస్తున్న శాశవత్ జైన్.శంషాబాద్ లోని వందల ఎకరాల్లో రియల్ ఎస్టేట్ బిజినెస్ చేస్తున్న జైన్.తెలుగు రాష్ట్రాల్లో లో eta  surf  ను  జైన్ పరిచయం చేశాడు.ప్రముఖ కాంట్రాక్టర్ దండు సూర్య సుమంత్ రెడ్డి అరెస్ట్ చేశారు. పలు ప్రభుత్వ కాంట్రాక్టర్లను చేపట్టిన సూర్య సుమంత్ రెడ్డి.నిరంజన్ జైన్,  సుమంత్ రెడ్డి కలిసి హైదరాబాదులో బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు.

ప్రముఖ వ్యాపారి బండి భార్గవ్ అరెస్ట్ చేశారు. తెలుగు రాష్ట్రాల్లో పలు కాంట్రాక్టులను  బండి భార్గవ్ నిర్వహిస్తున్నారని రిమాండ్ రిపోర్టులో పోలీసులు వివరించారు.  ప్రముఖ ఎగుమతుల, దిగుమతుల వ్యాపారి వెంకట్ చలసాని కూడా డ్రగ్స్ కేసులో అరెస్టయ్యాడు. ఆంధ్ర తెలంగాణలో ప్రముఖ ఎక్స్‌పోర్ట్  వ్యాపారిగా చలసాని వెంకట్ కు పేరుంది. భార్గవ్ , వెంకట్ లు కలిసి పార్టనర్స్ గా ఎగుమతుల వ్యాపారం చేస్తున్నారని ఆ రిపోర్టులో పోలీసులు వివరించారు.

Follow Us:
Download App:
  • android
  • ios