ప్రముఖ పుణ్యక్షేత్రం యాదరిగుట్టలో చిన్నారి బాలికలతో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను పోలీసులు పట్టుకున్నారు. ఈ ముఠా చేతిలో చిక్కి శారీరకంగానూ, మానసికంగానూ దోపిడీకి గురవుతన్న బాలికలను పోలీసులు రక్షించారు. దాదాపు 11 మంది మైనర్ బాలికలను వ్యభిచార ముఠా నుండి పోలీసులు కాపాడారు.  

యాదగిరి గుట్ట కింద బహిరంగంగా వ్యభిచార గృహాలు వెలిసిన విషయం తెలిసిందే. దైవ దర్శనానికి వచ్చే భక్తులను, పర్యాటకులను ఆకర్షిస్తూ ఈ వ్యభిచార ముఠా పుణ్యక్షేత్రం సమీపంలో పాపపు పనులు చేస్తోంది. అయితే ఈ వ్యభిచార గృహాల్లో మైనర్ బాలికలతో వ్యభిచారం జరుగుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఇవాళ ఎస్‌వోటీ పోలీసులు, రాచకొండ షీటీమ్ బృందాలు జంటగా స్థానిక పోలీసుల సాయంతో యాదాద్రిలో వ్యభిచార గృహాలపై దాడులు జరిపారు. 

ఆ దాడుల్లో మరో భయంకరమైన నిజం బైటపడింది. బాలికలకు ఊహతెలియని వయసులోనే ఇక్కడికి తీసుకువచ్చి కాస్త వయసొచ్చాక ఈ రొంపిలోకి లాగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. బాలికలు తొందరగా ఎదిగేలా వారికి ప్రత్యేకమైన ఇంజక్షన్స్ ఇస్తున్నట్లు గుర్తించారు.అప్పటివరకు వారితో నానా చాకిరీ చేయిస్తూ మానసికంగానూ, శారీరకంగానూ వేధిస్తున్నట్లు తెలిసింది.

ఇవాళ జరిగిన దాడిలో 11మంది బాలికలను రాచకొండ పోలీసులు రక్షించారు. అలాగే వీరితో వ్యభిచారం నిర్వహిస్తున్న 8 మంది ముఠా ను అరెస్ట్ చేసి వారిపై పిడియాక్టు నమోదు చేసినట్లు రాజకొండ సిపి మహేష్ భగవత్ తెలిపారు. ఈ ముఠా గుట్టు రట్టు చేసిన పోలీసులకు సిపి రివార్డు అందజేసి అభినందించారు. 

వీడియో

"