హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. ట్విట్టర్ వేదికగా ఆయన జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ కేసీఆర్ కు ట్యాగ్ చేశారు.  

"భగవంతుడు మీకు సంపూర్ణ ఆయురారోగ్య ఆనందాలను ప్రసాదించాలని హృదయపూర్వకంగా కోరుకుంటున్నాను" అని చంద్రబాబు అన్నారు.

 

విశాఖపట్నం జిల్లా అచ్యుతాపురంలో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ అక్కడి అభిమానులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు.

తండ్రి కేసీఆర్ కు కుమారుడు, ఐటి శాఖ మంత్రి కేటీఆర్ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. తల్లిని కన్న తనయుడికి జన్మదిన శుభాకాంక్షలు అంటూ #HappyBirthdayKCR అనే హ్యాష్ ట్యాగ్ ఇచ్చారు.