వరి ధాన్యం కొనుగోలు విషయంలో తెలంగాణ రాష్ట్రం తమకు దమ్కీ ఇస్తుందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు. రాష్ట్ర రైతులను టీఆర్ఎస్ సర్కార్ తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు.
న్యూఢిల్లీ: వరి ధాన్యం కొనుగోలు విషయమై తెలంగాణ ప్రభుత్వం తమకు దమ్కీలు ఇస్తుందని కేంద్ర ఆహార శాఖ మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.శుక్రవారం నాడు Rajya Sabha లో ప్రశ్నోత్తరాల సమయంలో వరి ధాన్యం కొనుగోలుపై టీఆర్ఎస్ సభ్యుల ప్రశ్నలకు కేంద్ర మంత్రి Piyush Goyal సమాధానం ఇచ్చారు. తాము బాయిల్డ్ రైస్ ఇవ్వమని Telangana ప్రభుత్వం లిఖిత పూర్వకంగా హామీ ఇచ్చిందని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ చెప్పారు.
అవసరం లేకుండా బియ్యం తీసుకొని కేంద్ర ప్రభుత్వం ఏం చేయాలని ఆయన ప్రశ్నించారు. Raw Rice అయితేనే తాము తీసుకుంటామని రాష్ట్రానికి స్పష్టంగా చెప్పామని పీయూష్ గోయల్ చెప్పారు. లేదంటే మీ రాష్ట్రంలోనే బియ్యాన్ని పంపిణీ చేసుకోవాలని కేంద్ర మంత్రి గోయల్ తెగేసి చెప్పారు. ఇప్పుడు కొత్తగా వరి ధాన్యం సేకరణ అంశాన్ని తెలంగాణ ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చిందని పీయూష్ గోయల్ మండిపడ్డారు.
తెలంగాణ సర్కార్ దమ్కీ ఇస్తోందిఆహార భద్రత కింద తీసుకొనే బియ్యాన్ని ఎగుమతి చేయలేమన్నారు. ఇతర రాష్ట్రాలు తినగలిగే బియ్యం ఉంటేనే సెంట్రల్ పూల్ కు మిగులు బియ్యం తీసుకొంటామని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ వివరించారు. Punjab తరహలోనే తమ రాష్ట్రం నుండి కూడా వరి ధాన్యం కొనుగోలు చేయాలని సీఎం కేసీఆర్ లేఖ రాసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.
పంజాబ్ లో పండే ధాన్యాన్ని దేశం మొత్తం తింటారన్నారు. అదే తరహలోని ధాన్యాన్ని ఇస్తే తాము తీసుకొంటామని తెలంగాణ సర్కార్ కు చెప్పినట్టుగా పీయూష్ గోయల్ వివరించారు. తెలంగాణ ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలు విషయంలో రాష్ట్ర రైతులను తప్పుదారి పట్టించేలా వ్యవహరిస్తుందని పీయూష్ గోయల్ విమర్శించారు. తెలంగాణలో పండిన రా రైస్ ను తాము కొనుగోలు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు. అయితే బాయిల్డ్ రైస్ నాలుగేళ్లుగా గోడౌన్లలోనే ఉన్నాయని ఆయన గుర్తు చేశారు. ధాన్యం కొనుగోలుపై కేంద్రం అయోమయం సృష్టిస్తోందని టీఆర్ఎస్ ఎంపీ కె. కేశవరావు విమర్శించారు.
