హైదరాబాద్: ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సీబీఐ కోర్టులో శుక్రవారం నాడు చుక్కెదురైంది. ఐదు ఛార్జీషీట్లను ఒకేసారి విచారించాలని దాఖలు చేసిన పిటిషన్‌ను సీబీఐ కోర్టు శుక్రవారం నాడు తిరస్కరించింది

సీబీఐ విచారణ పూర్తయ్యే వరకు ఈడీ విచారణను చేపట్టరాదని జగన్ దాఖలు చేసిన పిటిషన్‌ను కూడ సీబీఐ కోర్టు కొట్టేసింది. ఆస్తుల కేసు వ్యవహారంలో తాను వ్యక్తిగతంగా కోర్టుకు హాజరు కాలేనని సీబీఐ కోర్టు లో అప్సెంట్ పిటిషన్ దాఖలు చేసిన ఏపీ ముఖ్యమంత్రి జగన్ దాఖలు చేశారు.

Also read: ఈడీ కేసులో మినహయింపు కోరిన జగన్

. అయితే  ఇవాళ మాత్రం కోర్టుకు హాజరు కావడంపై మినహాయింపు ఇచ్చింది. ఆస్తుల కేసు విచారణను ఈ నెల 24 కు వాయిదా వేసింది సీబీఐ కోర్టుకు .వచ్చే వారం ఈ కేసులో జగన్  కోర్టుకు హాజరు అవుతారా లేదా అనేది ఇంకా తేలాల్సి ఉంది. 

Also read:ఆస్తుల కేసు: సీబీఐ కోర్టుకు హాజరైన ఏపీ సీఎం జగన్

Also read:అక్రమాస్తుల కేసు: తప్పనిసరి పరిస్థితుల్లో, ఎల్లుండి సీబీఐ కోర్టుకి జగన్

మరో వైపు పెన్నా సిమెంట్ అనుబంధ చార్జిషీట్ లో CBI కోర్ట్ కి హాజరైన మంత్రి సబితా, మాజీ మంత్రి ధర్మాన, ఐఏఎస్ అధికారిని శ్రీ లక్ష్మీ, విశ్రాంతి అధికారులు శ్యాముల్,వీడి రాజగోపాల్, RDO సుదర్శన్ రెడ్డి, తహశీల్దార్ ఎల్లమ్మ హాజరయ్యారు.