ప్రేమించి మోసం చేశాడంటూ కరణ్ కాన్సెప్ట్స్ ఎండీ కరణ్ రెడ్డిపై బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిందో యువతి. హైదరాబాద్ శ్రీనగర్ కాలనీలోని కరణ్ కాన్సెప్ట్స్‌ కార్యాలయంలోనే తనపై అసభ్యంగా ప్రవర్తించాడంటూ ఫిర్యాదులో పేర్కొంది.

లైంగికంగా వాడుకుని వదిలేశాడని ఆమె ఆరోపించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కరణ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు. మ్యూజిక్ టీచర్‌గా పనిచేస్తున్న యువతికి ఫేస్‌బుక్‌లో పరిచయమయ్యాడు.

అతని స్నేహితుడిగా భావించి తన కుటుంబంతో పాటు ఆర్ధిక సమస్యలన్ని పంచుకుంది. దీంతో కరణ్ ఆమెకు ఆర్ధికంగా సహాయం చేస్తాడంటూ దగ్గరయ్యాడు. ఆమెను కార్యాలయానికి పిలిచాడు.

పెళ్లి చేసుకుంటానని నమ్మించి, లోబరచుకున్నాడు. మోజు తీరాక ఆమెను దూరం పెట్టడంతో పాటు వాట్సాప్‌లో బ్లాక్ చేశాడు. తర్వాత కరణ్ రెడ్డి కుటుంబసభ్యులను ఫేస్‌బుక్ ద్వారా సంప్రదించడానికి ఆమె ప్రయత్నించింది.

ఈ క్రమంలోనే కరణ్ భార్య ఫోన్ చేసి.. తన భర్తను మరిచిపోవాలని వార్నింగ్ ఇచ్చింది. దీంతో బాధితురాలు బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది.