Asianet News TeluguAsianet News Telugu

ఔటర్ రింగ్ రోడ్డు కారు దగ్ధం.. డాక్టర్ మృతి , ప్రమాదమేనా..?

ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో  ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందించారు కొంతకాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు

Car blaze: Challan helps cops identify charred doctor
Author
Hyderabad, First Published Sep 20, 2021, 9:22 AM IST
  • Facebook
  • Twitter
  • Whatsapp


ఔటర్ రింగ్ రోడ్డుపై శనివారం రాత్రి కారు దగ్ధమైన సంగతి తెలిసిందే. కాగా.. ఈ ఘటనలో చనిపోయిన వ్యక్తిని  డాక్టర్ నేలపాటి సుధీర్(39) గా గుర్తించారు. ఆయన కారు  చలాన్ల ఆధారంగా.. అతనిని గుర్తించడం గమనార్హం. ఆయన స్వస్థలం ఆంధ్రప్రదేశ్ లోని ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం కేంద్రంలోని శివాజీ నగర్ కి చెందిన వ్యక్తిగా తెలుస్తోంది. కొన్ని సంవత్సరాలుగా కేపీహెచ్ బీ పరిధిలోని సర్దార్ పటేల్ నగర్ లోని కుటుంబసభ్యులతో కలిసి నివాసం ఉంటున్నాడు.

ఆయనకు భార్య సుప్రజ, తొమ్మిది సంవత్సరాల కుమారుడు ఉణ్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆయన నగరంలోని ఓ కార్పొరేట్ ఆస్పత్రిలో  ఆర్థోపెడిక్ వైద్యుడిగా సేవలందించారు కొంతకాలం నుంచి ఆయన వైద్య వృత్తిని వదిలి మైనింగ్ వ్యాపారం మొదలుపెట్టారు. శనివారం ఆయన బయటకు వెళ్లానని కుటుంబసభ్యులకు చెప్పి కారులో ఒంటరిగా బయలు దేరారు. నానక్ రామ్ గూడ కూడలి వద్ద ఔటర్ రింగ్ రోడ్డు వద్ద ఆయన కారులో మంటలు చెలరేగాయి. ఈ ఘటనలో ఆయన సజీవ దహనమయ్యారు.

ఇదిలా ఉండగా.. ఔటర్ రాింగ్ రోడ్డుపై గంటకు వంద కిలోమీటర్ల వేగంతో ప్రయాణించడానికి అనుమతి ఉంది. అయితే.. సుధీర్  నానక్ రామ్ గూడ కూడలి వద్ద సాయంత్రం 7 గంటలకు ఔటర్ రింగ్  రోడ్డుపైకి ప్రవేశించినట్లు సీసీ కెమేరాల్లో రికార్డు అయ్యింది. నానక్ రామ్ ూగడ నుంచి 20 కిలోమీటర్ల దూరంలో ఉన్న హమీదుల్లా నగర్ వద్ద కు 20 నిమిషాల్లో చేరుకోవచ్చు కానీ.. ఆయనకు గంటకుపైగానే సమయం పట్టింది.  రాత్రి 8.10 గంటలకు హమీదుల్లా నగర్ వద్ద ఆయన కారులో మంటలు చెలరేగాయి. ఈ నేపథ్యంలో.. ఆయనది నిజంగానే ప్రమాదమా లేక.. ఎవరైనా హత్య చేశారా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios