Asianet News TeluguAsianet News Telugu

న్యూడ్ కాల్ చేయకపోతే.. మార్ఫ్ డ్ ఫొటోలు అప్ లోడ్ చేస్తా.. బాలికకు వేధింపులు..

రోజురోజుకూ మైనర్ల మీద మైనర్లు చేస్తున్న అకృత్యాలు మితిమీరిపోతున్నాయి. మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా, అడ్డూఅదుపూ లేని పోర్న్.. అడ్డకునేవారు లేకపోవడం.. చిన్నవయసులోనే అబ్బాయిల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాంటిదే ఓ దారుణ ఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగింది. 

boy harassing to a minor girl on instagram, hyderabad - bsb
Author
Hyderabad, First Published Jun 12, 2021, 12:06 PM IST

రోజురోజుకూ మైనర్ల మీద మైనర్లు చేస్తున్న అకృత్యాలు మితిమీరిపోతున్నాయి. మితిమీరిన సెల్ ఫోన్ వాడకం, సోషల్ మీడియా, అడ్డూఅదుపూ లేని పోర్న్.. అడ్డకునేవారు లేకపోవడం.. చిన్నవయసులోనే అబ్బాయిల్ని తప్పుదోవ పట్టిస్తున్నాయి. అలాంటిదే ఓ దారుణ ఘటన హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో జరిగింది. 

ఫ్రెండే కదా నమ్మి రిక్వెస్ట్ యాక్సెప్ట్ చేసినందుకు మైనర్ బాలికను వేధింపులకు గురిచేస్తున్నాడో మైనర్ బాలుడు. సైదాబాద్ కు చెందిన ఇంటర్మీడియట్ బాలిక ఇన్ స్ట్రాగామ్ అకౌంట్ కు తన క్లాస్ మేట్ ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టాడు. ప్రెండే కదా అని యాక్సెప్ట్ చేయగా కొద్ది రోజులుగా ఇద్దరూ చాటింగ్ చేసుకున్నారు. ఈ క్రమంలో బాలిక తన ఫ్రెండ్ కు కొన్ని ఫొటోస్ ను పంపింది.

ఆ ఫొటోలతో అతగాడు బాలిక పేరుతో ఫేక్ ఐడీని క్రియేట్ చేశాడు. తనకు న్యూడ్ గా వీడియో కాల్ చేయాలని, లేనిపక్షంలో నీ ఫొటోలన్నింటినీ ఎడిట్ చేసి సోషల్ మీడియాలో అప్ లోడ్ చైసి వైరల్ చేస్తానంటూ బెదిరింపులకు పాల్పడుతున్నాడు. దీంతో విసిగెత్తిన బాలిక అతడిమీద శుక్రవారం సైబర్ క్రైం పోలీసులకు ఫిర్యాదు చేసింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios