హైదరాబాద్ హైటెక్ సెక్స్ రాకెట్ గుట్టు రట్టు... ఇతర రాష్ట్రాల అమ్మాయిలతో వ్యభిచారం

https://static.asianetnews.com/images/authors/3800b66b-dc46-549b-a35e-91a1dbfb7895.jpg
First Published 18, Aug 2018, 11:49 AM IST
Bowenpally brothel busted; organiser, customers held
Highlights

హైదరాబాద్ లో హైటెక్ పద్దతిలో వ్యభిచారాన్ని నిర్వహిస్తున్న ఓ ముఠాను టాస్క్ ఫోర్స్ పోలీసులు పట్టుకున్నారు. ఈ వ్యభిచార నిర్వహకుల నుండి ఇతర రాష్ట్రాలకు చెందిన ముగ్గురు అమ్మాయిలను కాపాడారు.  ఈ వ్యభిచార గృహ నిర్వహకుడైన ఓ 24 ఏళ్ల యువకుడితో పాటు ఇద్దరు విటులను పోలీసులు అరెస్ట్ చేశారు. 
 
కరీంనగర్ జిల్లాకు చెందిన  భరత్ రెడ్డి(24) అనే యువకుడు శిరీష అనే మహిళ సాయంతో ఈ వ్యభిచార గృహాన్ని నిర్వహిస్తున్నాడు. వీరు న్యూ బోయిన్ పల్లి ప్రాంతంలోని జయా ఎన్ క్లేవ్ జె.ఎస్.ఆర్  రెసిడెన్సీలో ఓ ప్లాట్ ను అద్దెకు తీసుకుని ఈ వ్యవహారాన్ని నడిపిస్తున్నారు. శిరీష ఇతర రాష్ట్రాల నుండి అమ్మాయిలను తీసుకువచ్చి భరత్ కు అప్పగించగా అతడు వారిని విటుల వద్దకు పంపించడం, విటులనే ఈ ప్లాట్ కు రప్పించడం చేసేవాడు.  అయితే విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు తమ సిబ్బంది రైడ్ చేసినట్లు టాస్క్ పోర్స్ కమీషనర్ రాధాక్రిష్ణ రావు తెలిపారు. 

ఈ ముఠా భారి నుండి ముగ్గురు మహిళల్ని కాపాడిన పోలీసులు వారిని షెల్టర్ హోం కు తరలించారు. నిర్వహకుడు భరత్ రెడ్డితో పాటు విటులు జల్లి బాలపడిగ రావు(44),  ఉప్పలపాటి ఆకాశ్(24) లను అరెస్ట్ చేశారు. ఈ వ్యభిచార గృహాన్ని సీజ్ చేసిన పోలీసులు కొద్దిమొత్తంలో డబ్బులను,  ఆరు కండోమ్ ప్యాకెట్లు, మూడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. 

బాధిత మహిళలు పశ్చిమ బెంగాల్, ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు.   

loader