హైదరాబాద్: వ్యభిచారం కేసులో ఓ బ్యుటిషియన్ పట్టుబడింది. హైదరాబాదులోని బంజారాహిల్స్‌ రోడ్‌ నెం.12లోని ఎన్బీటీ నగర్‌లో ఓ ఇంట్లో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు సెంట్రల్ జోన్ టాస్క్ ఫోర్స్ పోలీసులకు సమాచారం అందింది. దాంతో పోలీసులు గురువారం రాత్రి దాడులు నిర్వహించారు. 

వ్యభిచారం నిర్వాహకుడితో పాటు సెక్స్‌ వర్కర్లను వారు అదుపులోకి తీసుకున్నారు. ఎన్బీటీ నగర్‌లో గత కొంత కాలంగా షేక్‌ ముజుమిల్‌ రెహమాన్‌ అనే వ్యక్తి వ్యభిచార కేంద్రం నిర్వహిస్తున్నట్లు తెలుసుకుని టాస్క్‌ఫోర్స్‌ పోలీసులు దాడులు నిర్వహించారు. 

నిర్వాహకుడు రెహమాన్‌తో పాటు గాంధీనగర్‌ దేవిచౌక్‌ ప్రాంతానికి చెందిన యువతిని అదుపులోకి తీసుకున్నారు. ఆ యువతి బ్యూటీషియన్‌గా పని చేస్తోంది. అయితే తాను నెలకు రూ.15 వేలు కూడా సంపాదించలేకపోతోంది. దీంతో ప్రతినెలా రూ. 50 వేలు ఇస్తానని రెహమాన్‌ చెప్పడంతో ఆరు నెలల క్రితం ఈ వృత్తిలోకి దిగినట్లు తెలిపింది. 

నిర్వాహకుడు కోల్‌కతా, ఢిల్లీ, బెంగళూరు, విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు చెందిన పలువురు యువతులను రప్పించి వ్యభిచారం చేయిస్తున్నట్లు ఆమె చెప్పింది. నిందితుడు రెహమాన్‌ను అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించారు.  పోలీసులు యువతిని పునరావాసకేంద్రానికి తరలించారు.