వ్యభిచారం చేస్తే.. డబ్బు ఎక్కువగా సంపాదించొచ్చని..

banjarahills police arrested two youth in hyd
Highlights

పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు.

‘‘ఎంత ఉన్నత చదువులు చదివినా.. ఆ చదువు తగిన ఉద్యోగం రావడం లేదు. ఒకవేళ వచ్చినా.. నెలంతా కష్టపడితే చేతికి పాతిక వేలు కూడా రావడం లేదు.’’ అని మనోవేదనకు గురైన ఓ యువకుడు వ్యభిచారం ముసుగులో డబ్బు సంపాదించాలనుకున్నాడు. తనతోపాటు మరో యువతిని కూడా ఈ కూపంలోకి లాగేందుకు ప్రయత్నించాడు. చివరకు ప్లాన్ బెడసి కొట్టి పోలీసులకు అడ్డంగా దొరికిపోయాడు.

బంజారాహిల్స్‌ పోలీసుల వివరాల ప్రకారం.. నెల్లూరులో దర్గామిట్ట ప్రాంతానికి చెందిన షేక్‌రహ్మాన్‌ (22) ఇంజినీరింగ్‌ చేశాడు. ఉద్యోగం కోసం ఎక్కడికి వెళ్లినా తక్కువ వేతనం వస్తోందని ఎలాగైనా తక్కువ సమయంలో రూ.లక్షలు సంపాదించాలని అనుకున్నాడు. అలా ఒంగోలుకు చెందిన యువతి నగరంలో ఓ బ్యూటీపార్లర్‌లో పని చేస్తుండగా ఆమెను పరిచయం చేసుకున్నాడు. ఆమెకూ వేతనం తక్కువ వస్తుందని అసంతృప్తి ఉండటంతో నెలకు రూ.50వేల వేతనం ఇస్తానని రహ్మాన్‌ ఆమెకు తెలిపారు. 

యువతి కూడా అంగీకరించడంతో ఇద్దరూ కలిసి వారం రోజుల కిందట బంజారాహిల్స్‌ రోడ్డు నం.12లో ఓ అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్‌ అద్దెకు తీసుకున్నారు. సదరు యువతి ఫొటోలు ఆన్‌లైన్‌లో పోస్టు చేసి విటులను ఆకర్షించాలని చూశాడు. ఈ విషయం బంజారాహిల్స్‌ పోలీసుల దృష్టికి వెళ్లగా గురువారం రాత్రి సదరు గృహంపై దాడి చేశారు. ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు ఇన్‌స్పెక్టర్‌ కె.శ్రీనివాస్‌ తెలిపారు.

loader