హైదరాబాద్: తనపై అత్యాచారం చేశారంటూ ఓయువతి పోలీసులను ఆశ్రయించడం హైదరాబాద్ లో కలకలం రేపుతోంది. ఇబ్రహీంపట్నంలోని గురునానక్ కాలేజీలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్న ఆ యువతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. 

తనతోపాటే అదేకళాశాలలో చదువుతున్న నేపాల్ కు చెందిన విద్యార్థి అత్యాచారానికి పాల్పడ్డాడని ఇబ్రహీంపట్నం పోలీసులకు ఫిర్యాదు చేసింది. యువతి నిజామాబాద్‌ జిల్లాకు చెందినదిగా పోలీసులు గుర్తించారు. ఆమె ఫిర్యాదుపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.