తల్లి కోసం ఆర్థరాత్రి ఆటో ఎక్కితే డ్రైవర్ రేప్ చేశాడు

Auto driver rapes girl in Hyderabad
Highlights

అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి మాత్రలు తేవడానికి అర్ధరాత్రి సమయంలో ఆమె ఆటో ఎక్కింది.ఆమెపై ఆటో డ్రైవరే అత్యాచారం చేశాడు. 

హైదరాబాద్: అనారోగ్యంతో బాధపడుతున్న తల్లికి మాత్రలు తేవడానికి అర్ధరాత్రి సమయంలో ఆమె ఆటో ఎక్కింది.ఆమెపై ఆటో డ్రైవరే అత్యాచారం చేశాడు. బాధితురాలి కేకలు విన్న గస్తీ పోలీసులు కిలోమీటరు వెంటాడి అతన్ని పట్టుకున్నారు. 

హైదరాబాద్‌ శివారులోని బాచుపల్లి పోలీసు స్టేషన్ పరిధిలో ఆదివారం అర్ధరాత్రి ఈ ఘటన జరిగింది. మహబూబ్‌నగర్‌ జిల్లాలోని  గ్రామానికి చెందిన వివాహిత(20) ప్రగతినగర్‌ పరిధిలో నివసిస్తున్న తల్లిదండ్రుల వద్దకు వచ్చింది

ఆదివారం అర్ధరాత్రి దాటిన తల్లి అనారోగ్యానికి గురి కావడంతో మాత్రలు తేవడానికి రోడ్డుపైకి వచ్చింది. అదే సమయంలో అటువైపు వచ్చిన బౌరంపేట ఇందిరమ్మ కాలనీలో నివసించే సంగనమోని పరశురాం(25)కు చెందిన ఆటో ఎక్కింది. మందుల దుకాణం  చూపించాలని అడిగింది.

బాచుపల్లి చౌరస్తాలో తనకు తెలిసిన దుకాణం ఉందని నమ్మించిన అతను నైన్‌స్టార్‌ హోటల్‌ వెనకున్న ఖాళీ ప్రదేశంలోకి లాక్కెళ్లి యువతిపై అత్యాచారం చేశాడు. బాధితురాలు కేకలు వేసింది. దాంతో అటుగా వెళ్తున్న పెట్రోలింగ్‌ సిబ్బంది అప్రమత్తమయ్యారు. 

కిలోమీటర్‌ దూరం వెంటాడి  మల్లంపేట రోడ్డులో నిందితుణ్ని పట్టుకున్నారు. బాధితురాలిని వైద్యపరీక్షల నిమిత్తం ఆసుపత్రికి పంపించారు

loader