Asianet News TeluguAsianet News Telugu

ఆన్ లైన్ మీడియా జర్నలిస్టులకు అల్లం నారాయణ హామీ (వీడియో)

ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. మీడియా రంగంలో నానాటికీ వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు పరిణతి చెందాలని సూచించారు. ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలకు అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఆన్‌లైన్‌ మీడియా జర్నలిస్టుల సమస్యలు పరిష్కరిస్తామని తెలంగాణ ప్రెస్‌ అకాడమీ చైర్మెన్‌ అల్లం నారాయణ పేర్కొన్నారు. మీడియా రంగంలో నానాటికీ వస్తున్న మార్పులకు అనుగుణంగా జర్నలిస్టులు పరిణతి చెందాలని సూచించారు. ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ ఆధ్వర్యంలో సోమవారం సోమాజిగూడలోని హైదరాబాద్‌ ప్రెస్‌క్లబ్‌లో నిర్వహించిన క్రిస్మస్‌ వేడుకలకు అల్లం నారాయణ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ పరంగా సంక్షేమ పథకాలను మీడియా జర్నలిస్టులకు అందించడంతో తన వంతు కృషి చేస్తానన్నారు. రానున్న రోజుల్లో జర్నలిస్టులకు సౌకర్యవంతంగా మరిన్ని సంక్షేమ పథకాలను ప్రభుత్వం తీసుకురానుందన్నారు. ప్రభుత్వం అందజేస్తున్న బీమా సౌకర్యాలు, ఇళ్ల నిర్మాణం వంటి వాటితోపాటు మరిన్ని ప్రతిపాదనలను సిద్ధం చేశామని, సాధ్యమైనంత త్వరగా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళతామన్నారు. మీడియా జర్నలిస్టులు ఉద్యోగ బాధ్యతల నిర్వహణలో భాగంగా ఎదుర్కొంటున్న సమస్యలను ఎప్పటికప్పుడు తమ దృష్టికి తీసుకురావాలని సూచించారు. సీనియర్‌ పాత్రికేయుడు శైలేష్ రెడ్డి మాట్లాడుతూ ఆన్‌లైన్‌ మీడియా సంస్థలు నియంత్రణ పాటించాలన్నారు. యూట్యూబ్‌, ఫేస్‌బుక్‌ తదితర మాధ్యమాలను వాడుకుని వార్తలు ప్రసారం చేసే సంస్థలు ప్రమాణాలు పాటించకపోవటం వల్ల ఇబ్బందులు తలెత్తుతున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఫాస్టర్‌ సజ్జన్‌ రావు క్రిస్మస్‌ విశిష్టతను వివరించారు. ఈ కార్యక్రమంలో ఆన్‌లైన్‌ మీడియా వర్కింగ్‌ జర్నలిస్ట్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రమేష్‌, ప్రధాన కార్యదర్శి శ్రీధర్‌, గౌరవ అధ్యక్షులు ప్రతాపరెడ్డి తదితరులు పాల్గొన్నారు.