Asianet News TeluguAsianet News Telugu

మందేసి చిందేసిన కొత్తూరు పోలీసులపై వేటు: విచారణకు ఆదేశం

మందేసి చిందులేసిన పోలీసులపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. నాగిని డ్యాన్స్ చేస్తూ మద్యం సేవించిన కొత్తూరు పోలీసులను సీపీ ఆఫీసుకు అటాచ్ చేస్తూ ఆదేశాలు జారీ అయ్యాయి.

Action taken against the police for dancing, while consuming liquor
Author
Shadnagar, First Published Feb 29, 2020, 4:25 PM IST

షాద్ నగర్: మందేసి చిందేసిన పోలీసులపై వేటు పడింది. ఓ ఎఎస్ఐ, నలుగురు కానిస్టేబుళ్లు, ఓ హోంగార్డులపై చర్యలు తీసుకుంటూ ఆదేశాలు వెలువడ్డాయి. వారిని సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ కు అటాచ్ చే్సతూ ఆదేశాలు జారీ చేశారు.

సంఘటనపై సమగ్ర విచారణ చేయాలని పోలీసు కమిషనర్ ఏసీపీని ఆదేశించారుకొత్తూరు ఎఎస్ఐ బాలస్వామి, కానిస్టేబుళ్లు అశోక్ రెడ్డి, అమర్నాథ్, చంద్రమోహన్, వెంకటేష్ గౌడ్, హోంగార్డు రామకృష్ణా రెడ్డిలపై వేటు పడింది. 

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ లో పోలీసులు నాగిని డ్యాన్సులు చేశారు. ఏకంగా మద్యం బాటిళ్లు నోట్లో పెట్టుకొని నాగిని డ్యాన్సులు చేశారు. కొత్తూరు పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న కొంతమంది సిబ్బంది   ఫరూఖ్ నగర్ మండలంలోని రామేశ్వరం  సమీపంలో ఓ వెంచర్ లో పార్టీ చేసుకున్నారు. మద్యం సేవించిన తర్వాత  మరికొంత పోలీస్ సిబ్బంది  వీడియో చిందులు వేస్తూ కనిపించారు ఈ వీడియో సోషల్ మీడియాలో లో వైరల్ అవుతుంది.

Also Read: మద్యం మత్తు లో పోలీసుల నాగినీ డ్యాన్సులు.. సోషల్ మీడియాలో వైరల్

ఇటీవల షాద్ నగర్ లో పోలీసులు గెట్ గెదర్ ఏర్పాటు చేసిన నేపథ్యంలో కొందరు పోలీస్ సిబ్బంది కూడా వీడియోలు తీశారు. ప్రెస్ సిబ్బంది కూడా వీడియోస్ తీశారు. చివరికి సోషల్ మీడియాలలోవైరల్ కావడంతో ఉన్నతదికారులు సీరియస్ అయ్యారు.

Follow Us:
Download App:
  • android
  • ios