Asianet News TeluguAsianet News Telugu

చికెన్ నాణ్యత సరిగా లేదని వివాదం.. అమ్మకందారుపై యాసిడ్ దాడి...!!

చికెన్ గొడవ చివరికి యాసిడ్ అటాక్ కు దారి తీసింది. చికెన్ నాణ్యత సరిగా లేదని చికెన్ సెంటర్ ఓనర్ని ప్రశ్నించిన వినియోగదారులు అది కాస్త వివాదానికి దారితీయడంతో కోపంతో యాసిడ్ దాడికి దిగారు.

acid attack on chicken center owner in rajanna sirisilla district
Author
Hyderabad, First Published Apr 1, 2022, 11:24 AM IST

సిరిసిల్లా : Rajanna Sirisilla District వేములవాడ మున్సిపాలిటీ పరిధి తిప్పాపూర్ గ్రామంలో జరిగిన Chicken గొడవ ఉద్రిక్తతకు దారి తీసింది. హరీష్ అనే వ్యక్తి చికెన్ సెంటర్ నిర్వహిస్తుండగా సప్తగిరి కాలనీకి చెందిన చిరు వ్యాపారులు చికెన్ కొనుగోలు చేశారు. ఇంటికెళ్లి వంట చేసుకున్న తరువాత చికెన్ లో నాణ్యత లేదంటూ షాపు వద్దకు వచ్చి గొడవ చేశారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య గొడవ జరిగింది. 

దీంతో ఆగ్రహానికి గురైన చిరు వ్యాపారులు చికెన్ షాపు నిర్వాహకుడు హరీష్ తో పాటు అడ్డుగా వచ్చిన మరికొందరిపై Acidతో attack చేశారు. ఈ ఘటనలో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను కరీంనగర్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. ఇరు వర్గాల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వేములవాడ పట్టణ సీఐ వెంకటేష్ తెలిపారు. 

ఇదిలా ఉండగా, మార్చి 30 న హైదరాబాద్ లో ఇలాంటి ఘటనే జరిగింది.  పీకలదాకా liquor తాగి chicken తీసుకుని ఇంటికి వెడితే భార్య వండలేదని కోపంతో acid తాగి ఆసుపత్రిపాలైన భర్త చికిత్స పొందుతూ మృతి చెందాడు. దుండిగల్ ఇన్ స్పెక్టర్ రమణారెడ్డి వివరాల ప్రకారం.. మహబూబ్ నగర్ జిల్లా కేతిరెడ్డిపల్లి చింతకుంట తండాకు చెందిన ఆటో డ్రైవర్ రతన్ లాల్ (32), రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కూతురు. మూడేళ్ల క్రితం బతుకుదెరువుకు వచ్చి దుండిగల్ లో అద్దె ఇంట్లో ఉంటున్నారు. ఈ నెల 25 సాయంత్రం మద్యం తాగి కోడి మాంసం కొని ఇంటికెళ్లాడు. 

కూతురికి అమ్మవారు సోకినందున మాంసాహారం తినొద్దని, ఇంట్లో ఒండద్దని రాధిక భర్తకు నచ్చజెప్పింది. అయినా అతను వినలేదు. మరుసటి రోజు తాను suicide చేసుకుంటున్నట్లు తల్లికి ఫోన్ చేసి యాసిడ్ తాగి ఇంటికొచ్చాడు. అస్వస్థతకు గురైన అతడు చికిత్స పొందుతూ సోమవారం అర్థరాత్రి దాటాక మృతి చెందాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్ స్పెక్టర్ తెలిపారు. 

సాయంత్రం వండిపెడతానన్నందుకు...
గతంలో కూడా హైదరాబాద్ లో ఇలాంటి ఘటనలు జరిగాయి. పశ్చిమ గోదావరి జిల్లా కానూరుకు చెందిన సత్యనారాయణ ఉపాధి నిమిత్తం తన కుటుంబంతో కలిసి హైదరాబాద్.. జూబ్లీహిల్స్ లో భార్య దేవకి, కొడుకు ధనేశ్వర్, కూతురు మల్లీశ్వరితో కలిసి ఉంటున్నాడు. అయితే మద్యానికి బానిసైన సత్యనారాయణ రోజూ మద్యం సేవించి భార్యను వేధించేవాడు. ఇలాగే ఆ రోజు ఉదయం కూడా ఫుల్లుగా మద్యం తాగి వచ్చిన ఆయన భార్యకు చికెన్ వండమని చెప్పాడు. అయితే అప్పటికే కూలీ పనులకు వెళ్లడానికి సిద్దమైన దేవకి సాయంత్రం వచ్చాక వండిపెడతానని చెప్పి కొడుకుతో కలిసి బైటికి వెళ్లిపోయింది. కూతురు కూడా స్కూల్ కి వెళ్లిపోయింది. తను చికెన్ వండమంటే భార్య తాను చెప్పిన మాట వినకుండా బైటికి వెళ్లిపోయిందని మనస్తాపానికి గురైన సత్యనారాయణ మద్యం మత్తులో ఇంట్లోనే ఫ్యాన్ కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు.

Follow Us:
Download App:
  • android
  • ios