Asianet News TeluguAsianet News Telugu

లుంబినీ పార్క్ వద్ద అదుపుతప్పి హుస్సేన్ సాగర్ లో పడ్డ కారు (వీడియో)

హైదరాబాద్ ఎన్టీఆర్ ఘాట్ రోడ్డులోని లుంబినీ పార్క్ వద్ద ఓ కారు అదుపుతప్పి హుస్సేన్ సాగర్ లోకి దూసుకెళ్లి పడిపోయింది. అతివేగంతో కారు యూ టర్న్ వద్ద మలుపు తీసుకుంటూ..అదుపుతప్పి ఫుట్ పాత్ పైకి వెళ్లింది. ఫుట్ పాత్ గ్రిల్స్ ను ధ్వంసం చేసుకుంటూ కారు హుస్సేన్ సాగర్ నీళ్ళల్లో పడింది. కారులో ఉన్న నలుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. కారులో ఉన్న వారంతా ప్రాణాలతో బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.హుస్సేన్ సాగర్ నీళ్ళల్లో ఉన్న కారును క్రేన్ సాయంతో  బయటకు తీశారు. ప్రమాదానికి కారణం నిద్రమత్తా..మద్యం మత్తా అనే కోణంలో ఆరా తీస్తున్నారు పోలీసులు.

Video Top Stories