అక్రమ సంబంధం ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎసిబి అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డి విషయంలో మరో సంచలనం. గ్రూప్ 1 అధికారిగా ఎంపికైన ఆమె ఎసిబిలో డిఎస్పీగా తర్వాత పదోన్నతి పొంది అడిషనల్ ఎస్పీ గా పనిచేస్తున్నారు. అనేక సంచనల కేసులను సునీతారెడ్డి డీల్ చేశారు. ఎంతోమంది అవినీతిపరులను కటకటాల వెనకకు నెట్టారు.

కానీ సీన్ కట్ చేస్తే.. తన కింద పనిచేసే సిఐ మల్లిఖార్జునరెడ్డితో అక్రమ సంబంధం పెట్టుకుని వివాదాల్లో చిక్కుకున్నారు. ఇప్పుడు ఆమెకు మరో నెత్తినొప్పి వచ్చి పడింది. అవినీతి నిరోధక శాఖలో ఆమె సేవలు అవసరం లేదని ఆ శాఖ నుంచి పోలీసు పెద్దలకు వినతులు అందుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. ఎసిబి పరువును బజారులో పడేసిందంటూ ఆ శాఖ ఉన్నతాధికారులు వాపోతున్నారట. పత్రికల్లో, మీడియాలో సునీతారెడ్డి గురించి కథనాలు వస్తున్న తరుణంలో ఎసిబి నుంచి ఆమెను తప్పించాలని ఆ శాఖ అధికారులు కోరుతున్నారట. ఆమెను వేరే విభాగానికి బదిలీ చేయాలని ఉన్నతాధికారులు పోలీసు బాస్ కు లేఖ రాసినట్లు తెలిసింది.

సునీతారెడ్డి అక్రమ సంబంధం విషయంలో ఇప్పటికే విచారణ జరుగుతున్న తరుణంలో ఆమెపై ఎలాంటి చర్యలు తీసుకోవాలన్నా.. పోలీసు శాఖ పరిధిలో కాకుండా ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పోలీసు వర్గాలు చెబుతున్నాయి. ఒకవేళ ఆమె మీద చర్యలేమైనా తీసుకోవాలంటే.. ప్రభుత్వం ఉత్తర్వులు (జిఓ) జారీ చేయాల్సిన అవసరం ఉంటుంది.

దీంతో సునీతారెడ్డిని ఎసిబి నుంచి తప్పించాలని ఆ శాఖ ఉన్నతాధికారుల వినితిని సర్కారుకు నివేదించే అవకాశాలున్నట్లు చెబుతున్నారు. అంతిమ నిర్ణయం ప్రభుత్వమే తీసుకోవాల్సి ఉంది అని ఒక రిటైర్డ్ పోలీసు అధికారి వెల్లడించారు.