అక్రమ సంబంధం పెట్టుకుని పోలీసు శాఖ పరువు తీసిందని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎసిబి అడిషనల్ ఎస్పీ సునీతారెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఆమె భర్త సురేందర్ రెడ్డి కొద్దిసేపటిక్రితమే డిజిపి మహేందర్ రెడ్డిని కలిసి తన భార్య మీద కూడా వేటు వేయాలని డిమాండ్ చేశారు. మరోవైపు ఇప్పటికే అక్రమ సంబంధం కేసులో సిఐ మల్లిఖార్జునరెడ్డిని పోలీసు శాఖ సస్పెండ్ చేసింది.

తాజాగా సునీతారెడ్డిని సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది ప్రభుత్వం. తన వివాదాస్పద వ్యవహార సరళితో పోలీస్ శాఖ పరువు తీసిందనే ఆరోపణలపై ఏసీబీ అడిషనల్ ఎస్పీ సునీతా రెడ్డిని సస్పెండ్ చేస్తూ ప్రభుత్వం కొద్దిసేపటి క్రితమే ఉత్తర్వులు జారీ చేసింది. అయితే సునీతారెడ్డి సస్పెన్షన్ విషయాన్ని డిజిపి కార్యాలయ వర్గాలు ధృవీకరించాయి. మరికాసేపట్లోనే సస్పెన్షన్లు ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశమున్నట్లు చెబుతున్నారు.

అక్రమ సంబంధం కేసులో సిఐ మల్లిఖార్జునరెడ్డిని నిన్న రాత్రి సస్పెండ్ చేశారు. అయితే సునీతారెడ్డి భర్త  ఈ వ్యవహారాన్ని రట్టు చేయడంతోపాటు ఇద్దరి మీదా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసిన తరుణంలో ప్రభుత్వం చర్యలకు ఉపక్రమించినట్లు తెలుస్తోంది. 

సునీతారెడ్డి సస్పెన్ష్ తాలూకు సర్కారు విడుదల చేసిన జిఓ కాపీ కింద చూడొచ్చు.