హైదరాబాద్‌లో మరోసారి డ్రగ్స దందా బయటపడింది. నగరంలోని 788 ఎవెన్యూ పబ్ యజమాని రాహుల్ రెడ్డి డ్రగ్స్ అమ్ముతూ పోలీసులకు పట్టుబడ్డాడు. గురువారం నైజీరియన్స్ నుంచి పెద్ద ఎత్తున కొకైన్ కొనుగోలు చేశారని గుర్తించిన పోలీసులు పక్కా సమాచారంతో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో భాగంగా ఎవరెవరికి డ్రగ్స్ విక్రయించాడనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు.