న్యూఇయర్‌కు ముందు హైదరాబాద్‌లో డ్రగ్స్ కలకలం రేగింది. సరూర్‌నగర్‌లో డ్రగ్స్ అమ్ముతున్న ముగ్గురు విద్యార్ధులను అరెస్ట్ చేశారు పోలీసులు. మత్తు కలిగించే హషీశ్ ఆయిల్ అమ్ముతూ పోలీసులకు చిక్కారు.

నిందితులు అమీర్‌పేటలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో చదువుకుంటున్నారు. నిందితుల నుంచి 1500 గ్రాముల మత్తు మందును స్వాధీనం చేసుకున్నారు పోలీసులు.

అరకు నుంచి మత్తు మందు తెస్తున్న ఓ ముఠా.. విద్యార్ధులకు అమ్ముతున్నట్లు  గుర్తించారు పోలీసులు. ఈ ముగ్గురిని రిమాండ్‌కు తరలించారు రాచకొండ పోలీసులు.