Asianet News TeluguAsianet News Telugu

స్టార్ హోటల్ లో వ్యభిచారం.. డ్యాన్సర్ల అరెస్ట్

పెద్ద పెద్ద స్టార్ హోటల్స్.. వ్యభిచార కూపాలుగా మారుతున్నాయి. అతిధులుగా హోటల్ లోకి అడుగుపెట్టి.. రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. 

3 held in banjarahills star hotel over prostitution

పెద్ద పెద్ద స్టార్ హోటల్స్.. వ్యభిచార కూపాలుగా మారుతున్నాయి. అతిధులుగా హోటల్ లోకి అడుగుపెట్టి.. రహస్యంగా వ్యభిచారం నిర్వహిస్తున్నారు. బంజారాహిల్స్‌లోని ఓ స్టార్‌ హోటల్లో వ్యభిచారానికి పాల్పడేందుకు ప్రయత్నించిన ఓ యువకుడితోపాటు ఇద్దరు డ్యాన్సర్లను పోలీసులు అరెస్ట్‌ చేశారు.

 ధ్రువీకరణ పత్రాలు చూపే క్రమంలో పొంతన లేని సమాధానాలతో అనుమానం వచ్చిన హోటల్‌ సిబ్బంది ముందుగానే విషయాన్ని పసిగట్టి పోలీసులకు చేర వేయడంతో ఈ తతంగం బయటపడింది. 

బంజారాహిల్స్‌ పోలీసుల కథనం ప్రకారం.. రోడ్‌ నం.2లోని పార్క్‌హయత్‌ హోటల్‌కు శనివారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఇబ్రహీం అనే విద్యార్థితోపాటు మరో ఇద్దరు యువతులు వచ్చారు. ఇబ్రహీం పేరుమీద అప్పటికే గది నమోదై ఉంది. గదికి సంబంధించిన తాళాల కోసం అతను హోటల్‌లోని రిసెప్షన్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. అక్కడి సిబ్బంది అతని గుర్తింపు పత్రాలను అడిగారు. 

పక్కనే ఉన్న ఇద్దరు యువతుల గురించి ఆరా తీశారు. ఈ క్రమంలోనే ముగ్గురు పొంతన లేని సమాధానాలు చెప్పారు. అనుమానం వచ్చిన రిసెప్షన్‌ సిబ్బంది వారికి ఎలాంటి అనుమానం రాకుండా పక్కకు కూర్చోపెట్టారు. పోలీసులకు సమాచారం ఇచ్చారు. హోటల్‌కు చేరుకున్న పోలీసులు ఇబ్రహీంను అదుపులోకి తీసుకొని విచారించారు. అతను ఎంబీఏ చదివానని చెప్పాడు. 

సల్మాన్‌ అనే వ్యక్తితో తనకు పరిచయం ఉందని, అతను ఇద్దరు యువతులను వ్యభిచారం కోసం తనకు బంజారాహిల్స్‌ రోడ్‌ నంబరు 12లో అప్పగించారని తెలిపాడు. ఇందుకు తాను రూ.11 వేలు చెల్లించానని తెలిపాడు. అతనితోపాటు ఇద్దరు యువతులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. 

ఆ ఇద్దరు యువతులు డాన్సర్లని.. వారిలో ఒకరు నగరానికి చెందిన వారు, మరొకరిని పశ్చిమ బంగకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. యువతులను పునరావాస కేంద్రానికి తరలించారు. ఇబ్రహీంపై కేసు నమోదు చేశారు. సల్మాన్‌ పరారీలో ఉన్నట్లు తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios