Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్ లో మహిళలపై గ్యాంగ్ రేప్.. ఇద్దరి అరెస్ట్..

హైదరాబాద్ లో భిక్షాటన చేసుకునే ఓ మహిళ మీద ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మహిళ గట్టిగా అరువడంతో విషయం వెలుగులోకి వచ్చింది. 

24-year-old woman gangraped in Hyderabad, 2 held
Author
First Published Nov 1, 2022, 11:03 AM IST

హైదరాబాద్ : సోమవారం తెల్లవారుజామున ఛత్రినాకలోని నిర్జన ప్రదేశంలో 24 ఏళ్ల మహిళపై ఇద్దరు వ్యక్తులు అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. వీరిలో ఒకతను శ్మశాన వాటికలో పనిచేస్తాడని తెలిసింది. బాధితురాలైన మహిళను వైద్య పరీక్షల కోసం పంపారు.

వివరాల్లోకి వెడితే.. ఛత్రినాక జీచౌని ప్రాంతంలోని నిర్జన ప్రదేశం నుంచి ఓ మహిళ అరుపులు విన్న స్థానికులు వెంటనే గమనించగా.. ఓ బిచ్చగత్తె అయిన మహిళ దారుణ స్థితిలో ఉంది. వారు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు మహిళను కాపాడి.. ఆస్పత్రికి తరలించారు. మహిళనుంచి సేకరించిన వివరాల ప్రకారం.. నిందితుల్లో ఒకరు ఆమెకు తెలుసునని, మరో నిందితుడు అతని స్నేహితుడని పోలీసులు తెలిపారు.

నిందితుల్లో ఒకరు మొదట కాలాపత్తర్ ప్రాంతం నుంచి ఆమెను ద్విచక్ర వాహనంపై ఎక్కించుకుని ఇక్కడిని తీసుకువచ్చి లైంగిదాడికి పాల్పడ్డాడు. రెండవ నిందితుడు ఆ తరువాత వచ్చి అతనితో చేరాడు. ఈ సమయంలో మహిళ గట్టిగా అరుపులు, కేకలు వేయడంతో స్తానికులు అలర్ట్ అయ్యారని ఛత్రినాక ఇన్స్పెక్టర్ సయ్యద్ అబ్దుల్ ఖాదర్ జిలానీ చెప్పారు.

జూబ్లీహిల్స్ గ్యాంగ్ రేప్ కేసు.. డిశ్చార్జి పిటిషన్ దాఖలు చేసిన ఎంఐఎం ఎమ్మెల్యే కొడుకు..

బాధితురాలి ఫిర్యాదు మేరకు నిందితులిద్దరిపై పోలీసులు గ్యాంగ్‌ రేప్ కేసు నమోదు చేశారు. అనంతరం కౌన్సెలింగ్ కోసం మహిళను భరోసా కేంద్రానికి పంపించారు. నిందితులను జ్యుడీషియల్ రిమాండ్ నిమిత్తం మంగళవారం స్థానిక కోర్టులో హాజరుపరచనున్నారు.

ఇదిలా ఉండగా, ఢిల్లీ రాజధాని పరీవాహక ప్రాంతంలో దారుణ ఘటన వెలుగుచూసింది. హర్యానాలోని గురుగ్రామ్ లో పదో తరగతి చదువుతున్న బాలికపై శనివారం రాత్రి ఐదుగురు వ్యక్తులు హోటల్ లో సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. నిందితుల్లో ఇద్దరు బాలిక స్నేహితులే ఉండటం గమనార్హం. బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఈ ఘటనపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పద్నాలుగేళ్ల తన కుమార్తె శనివారం మధ్యాహ్నం పన్నెండున్నర గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లిందని బాధితురాలి తల్లి ఫిర్యాదు చేశారు.

ఇంటి దగ్గరలో ఉన్న పార్క్ కు వాకింగ్ కు వెళ్లి ఉంటుందని మొదట భావించానని.. ఎంతసేపటికి ఇంటికి రాకపోవడంతో ఆందోళనకు గురై వెతకగా.. కనిపించలేదని ఆమె పేర్కొన్నారు. ఆ మరుసటి రోజు ఉదయం 10గంటల సమయంలో ఇంటి సమీపంలో తన కుమార్తెను గుర్తించినట్లు ఆమె ఫిర్యాదులో తెలిపారు. రాత్రంతా ఎక్కడికి వెళ్లావు అని అడగగా.. తన స్నేహితుడు ఇద్దరూ బైక్ పై బయటకు ఎక్కించుకుని హోటల్ కి తీసుకుపోయారని.. వారితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు తనపై అఘాయిత్యానికి పాల్పడినట్లు బాలిక తన తల్లికి తెలిపింది.

ఎక్కడైనా ఈ విషయం చెబితే చంపేస్తామని కూడా బెదిరించారని వాపోయింది. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదు మేరకు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసుకున్నారు. బాధితురాలికి సివిల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆ పరీక్షల్లో ఆమెపై అత్యాచారం జరిగినట్టు వైద్యులు ధ్రువీకరించారని పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనపై డీసీపీ దీపక్ సహారా మాట్లాడుతూ సోమవారం ఇద్దరు నిందితులను అరెస్టు చేశామని వారిని విచారిస్తున్నట్లు తెలిపారు. అలాగే ఈ కేసులో మిగతా నిందితుల కోసం గాలిస్తున్నట్లు చెప్పారు.

Follow Us:
Download App:
  • android
  • ios