రియల్ ఎస్టేట్ ఆఫీసులోనే హైటెక్ వ్యభిచారం

2 arrested for running brothel in hyderabad
Highlights

రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో హైటెక్ వ్యభిచార నిర్వహిస్తున్న ఓ ముఠాను హైదరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను రప్పించి ఏకంగా  రియల్ ఎస్టేట్ ఆపీసులోనే వ్యభిచారం నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఆ ఆపీసుపై రైడ్ చేసిన నాచారం పోలీసులు హైటెక్ పద్దతిలో గుట్టుగా వ్యభిచారం గుట్టును రట్టు చేశారు. 

ఈ వ్యవహారానికి సంబంధించిన నాచారం ఇన్స్ పెక్టర్ విఠల్ రెడ్డి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. హబ్సిగూడ క్రాస్ రోడ్ లోని హరిప్రియ అపార్ట్ మెంట్ లోని సుధా రియల్ ఎస్టేట్ ఆఫీస్ లో వ్యభిచారం జరుగుతున్నట్లు పక్కా సమాచారం అందింది. దీంతో ఆ ఆఫీస్ పై రైడ్ చేసి నిర్వహకులు మల్లిఖార్జున్(30) తో పాటు కాసోజు సుధా అరెస్ట్ చేసినట్లు ఆయన తెలిపారు. వీరిద్దరు కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం పేరుతో ప్లాట్ ను అద్దెకు తీసుకుని, వివిధ ప్రాంతాల నుండి అమ్మాయిలను రప్పించి అందులో వ్యభిచారం నిర్వహిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. వీరి భారి నుండి ఓ ముంబై యువతిని కాపాడారు.

నిందితులిద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వారిని కస్టడీకి అప్పగించినట్లు, కోర్టు అనుమతితో వారిని విచారించి ఈ వ్యవహారానికి సంబంధించినట్లు పూర్తి సమాచారాన్ని రాబడతామని పోలీసులు తెలిపారు.  

loader