నాగోలు: భర్త స్నేహితుడని నమ్మినందుకు  ఓ వివాహిత మోసపోయింది. సహాయం చేస్తానని నమ్మించిన ఓ న్యాయవాది  కూల్‌డ్రింక్‌లో మత్తు మందు బాధితురాలిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. అంతేకాదు ఈ దృశ్యాలను చిత్రీకరించి తాను చెప్పినట్టు వినకపోతే  సోషల్ మీడియాలో ఈ వీడియోను అప్‌లోడ్ చేస్తానని బెదిరించాడు. నిందితుడిపై బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది.

విశాఖకు చెందిన ఈస్ట్‌పాయింట్ కాలనీకి చెందిన న్యాయవాది సోమశేఖర్  తాను సహాయం చేస్తానని  నమ్మించి  బాధితురాలిని తన ఇంటికి రప్పించి రేప్ చేసినట్టు బాధితురాలు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది.

బాధితురాలి భర్త బ్యాంకులో ఉద్యోగం చేసేవాడు. అతను ఇటీవల కాలంలో అతను మృతి చెందాడు.  సర్వీసులో మరణించినందున భర్త ఉద్యోగం కోసం బాధితురాలు ప్రయత్నాలు చేస్తోంది. భర్త స్నేహితుడైన న్యాయవాది సోమశేఖర్  ఆమెకు సహాయం చేస్తానని నమ్మించాడు.  బాధితురాలిని తన ఇంటికి పిలిపించాడు.

తన ఇంటికి వచ్చిన బాదితురాలికి సోమశేఖర్‌కు కూల్‌డ్రింక్‌లో మత్తు మందిచ్చి అత్యాచారానికి పాల్పడ్డారు.ఆ సమయంలో  వీడియోను కూడ సోమశేఖర్ చిత్రీకరించారు.  ఈ విషయాన్ని బయటకు చెబితే సోషల్ మీడియాలో ఈ వీడియోను  బయటపెడతానని తనను  బెదిరించారని  బాధితురాలు ఎల్బీనగర్ పోలీసులకు  ఫిర్యాదు చేసింది.