Telangana exit polls: ఎగ్జిట్ పోల్స్ ని ఎంత వరకు నమ్మచ్చు..?

ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి పలు సంస్థలు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో, తెలుసుకోవడానికి ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ని వారు దేని ఆధారంగా చెబుతారు? వాటిని మనం ఎంత వరకు నమ్మచ్చు..? అనే విషయాలుు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...

Telangana Elections:  Can We believe Exit Polls ? ram

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు పోలింగ్ ఈరోజు జరుగుతోంది. మరికాసేపట్లో రాష్ట్ర వ్యాప్తంగా పోలింగ్ ముగియనుంది. ఈ ఎలక్షన్స్ మొదలుపెట్టినప్పటి నుంచి రాష్ట్రంలోని అన్ని ప్రధాన పార్టీలు ప్రజలకు చేరువయ్యేందుకు, వారిని ఇంప్రెస్ చేయడానికి తమ వంతు ప్రయత్నాలు చేస్తారు. హోరాహీరోగా ప్రచారాలు కూడా చేశారు. వారి ప్రయత్నాలు అయిపోయాయి. ఫలితం ప్రజల చేతుల్లో ఉంది. వారు కూడా వారి అభిప్రాయాన్ని ఓటు రూపంలో ఈ రోజు తెలియజేశారు. ఫలితాలు విడుదల కావడానికి మధ్యలో రెండు రోజుల గ్యాప్ ఉంది. ఈలోగా ఎవరు గెలవచ్చు అనే ఊహాగానాలు చాలా మందికి ఉంటాయి. అయితే, ఎక్కువగా అందరి కళ్లు ఎగ్జిట్ పోల్స్ పై ఉంటాయి. నిజానికి గతంలో ఎన్నికలకు ముందు ఎగ్జిట్ పోల్స్ చెప్పేవారు. తర్వాతర్వాత ఈ ఎగ్జిట్ పోల్స్ ప్రభావం ప్రజలపై పడుతుందని భావించిన ఈసీ( ఎన్నికల సంఘం) వీటిపై ఆంక్షలు విధించడం మొదలుపెట్టింది.  ఓటింగ్ అయిపోయిన తర్వాతే చెప్పాలనే రూల్ పెట్టింది. ఈ రూల్ లోనూ ఈ సారి కొన్ని సవరణలు జరిగాయి. ఫలితంగా ఈ రోజు పోలింగ్ 5గంటలకు ముగిస్తే, ఎగ్జిట్ పోల్స్ 5: 30 నిమిషాలకు విడుదల కానున్నాయి. ఈ ఎగ్జిట్ పోల్స్ విడుదల చేయడానికి పలు సంస్థలు ఎంత ఉత్సాహంగా ఉన్నాయో, తెలుసుకోవడానికి ప్రజలు కూడా అంతే ఉత్సాహంగా ఉన్నారు. ఈ నేపథ్యంలో, అసలు ఈ ఎగ్జిట్ పోల్స్ ని వారు దేని ఆధారంగా చెబుతారు? వాటిని మనం ఎంత వరకు నమ్మచ్చు..? అనే విషయాలుు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం...


 ఎగ్జిట్ పోల్స్ ఏ ఆధారంగా చేస్తారు..?
చాలా సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ని ఒకప్పుడు స్వయంగా జనాల్లోకి వెళ్లి, వారికి కొన్ని పేపర్స్ ఇచ్చి, చిన్నపాటి పోలింగ్ లాంటిది నిర్వహించడం, వారిని కొన్ని ప్రశ్నలు అడగడం ద్వారా తెలియజేసేవారు. అప్పట్లో వారు డమ్మీ బ్యాలెట్ పేపర్ లాంటిది తయారు చేసి, దాని ఆధారంగా సర్వేలు నిర్వహించేవారు. కానీ, ఇప్పుడు కాలం మారిపోయింది. ఓటింగ్ పద్దతిలోనే బ్యాలెట్ విధానం లేదు. ఓటింగ్ కే మిషన్లు వచ్చాయి. దీంతో, ఎగ్జిట్ పోల్స్ నిర్వహించేవారి సర్వే విధానం కూడా మారిపోయింది. అయితే ఇప్పటికీ పలు ప్రాంతాల్లో తిరుగుతూ సర్వే చేస్తున్నారట. కొంత మేరకు ఆన్ లైన్, ఇంటర్నెట్ సదుపాయంతో చేస్తున్నారట. ఏది ఏమైనా పీపుల్ పల్స్ ని బట్టి వారు ఈ ఎగ్జిట్ పోల్స్ ని చెబుతుంటారు. ఈ సర్వేలో భాగంగా వారు వివిధ పోలింగ్ కేంద్రాల నుంచి ఇదే విధంగా సమాచారం సేకరిస్తారు.
ఈ సమాచారం ఆధారంగా పార్టీల ఓటింగ్ శాతం, గెలిచే సీట్ల సంఖ్యను అంచనా వేస్తారు.

ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్ కి తేడా ఏంటి..? 

ప్రీ పోల్, ఎగ్జిట్ పోల్స్ రెండూ నిర్వహించేవారు కూడా ఉన్నారు. ఒక్కోసారి ఈ రెండింటిలోనూ తేడాలు వస్తూ ఉంటాయి. ప్రీపోల్ నిర్వహించే సమయంలో ఓటర్ ఒకరికి ఓటు వేయాలని అనుకొని, ఓటింగ్ సమయానికి మనసు మార్చుకున్నప్పుడు ఈ తేడాలు వస్తూ ఉంటాయి. ఎక్కువ మంది తమ అభిప్రాయాలు మార్చుకునే అవకాశాలు ఉంటాయట. ప్రీ పోల్ సర్వేలు చాలా ముందే జరుగుతాయి. ఒక్కోసారి ఎన్నికల నోటిఫికేషన్ రావడానికి చాలా ముందు కూడా జరిగే అవకాశం ఉంది. ఈ పోల్ జరిగిన తర్వాత ఎన్నికల పార్టీల కూటములు మారిపోవచ్చు. లీడర్స్ పార్టీ మారచ్చు. నిలపడే నాయకులు కూడా మారిపోవచ్చు.   కానీ, ఎగ్జిట్ పోల్స్ మాత్రం ఓటింగ్ జరిగిన రోజు మాత్రమే నిర్వహిస్తారట. అందుకే, ప్రీ పోల్ సర్వే కంటే, ఎగ్జిట్ పోల్ సర్వేకి ఎక్కువ కచ్చితత్వం ఉంటుంది. 


ఎగ్జిట్ పోల్స్ ని నమ్మవచ్చా...?
చాలామంది ఎగ్జిట్ పోల్స్ ని నమ్మవచ్చా అనే సందేహాలు వ్యక్తం చేస్తూ ఉంటారు. అయితే, వీటిని నమ్మచ్చు. దాదాపు 95శాతం ఎగ్జిట్ పోల్స్ నిజమయ్యే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఎగ్జాక్ట్ గా కాకపోయినా 60శాతం ఈ పోల్స్ నిజం అవుతూ ఉంటాయి. కొన్ని సంస్థల ఎగ్జిట్ పోల్స్ కి తేడాలు ఉండొచ్చు. అయితే, కొన్ని సంస్థలు సదరు పార్టీకి సన్నిహితంగా ఉన్న సంస్థలు అయ్యి ఉంటే, వారికి అనుకూలంగా పోల్స్ ఇస్తూ ఉంటారు. కానీ, నమ్మకంగా ఇచ్చే సంస్థలు కూడా ఉంటాయి. కాబట్టి, ఎగ్జిట్ పోల్స్ ని నమ్మచ్చు. కాగా, ఈ ఎగ్జిట్ పోల్స్ రావడానికి, ఫలితాలు వెలువడటానికి పెద్దగా ఎక్కువ సమయం ఉండదు. రెండు,మూడు రోజుల్లో అసలు ఫలితం తెలిసిపోతుంది. అప్పుడు, ఏ సంస్థ సరైన ఫలితం ఇచ్చింతో అందరికీ స్పష్టంగా అర్థమౌతుంది. 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios