Asianet News TeluguAsianet News Telugu

షియోమీ ‘మ్యాక్స్’, ‘మీ నోట్’ ఫోన్లకు ఇక రాంరాం


ఈ ఏడాదిలో కొత్తగా మీ మ్యాక్స్, మీ నోట్ ఫోన్లను ఆవిష్కరించడం లేదని షియోమీ సీఈఓ లీ జున్ ప్రకటించారు.

Xiaomi Wont Launch New Mi Max Mi Note Phones This Year CEO Lei Jun Says
Author
New Delhi, First Published Jun 24, 2019, 11:51 AM IST

న్యూఢిల్లీ: బడ్జెట్‌ ధరలో అత్యుత్తమ ఫీచర్లతో ఫోన్లు తీసుకొచ్చి టెక్‌ ప్రియులను విపరీతంగా ఆకట్టుకుంది చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం షియోమీ. ప్రస్తుతం ఎంఐ, రెడ్‌మీ బ్రాండ్‌లతో ప్రస్తుతం దూసుకు పోతోంది. మరోవైపు సినిమాలు, గేమింగ్‌ ఆస్వాదించే వారి కోసం పెద్ద స్ర్కీన్‌, పెద్ద బ్యాటరీతో ఎంఐ ‘మ్యాక్స్‌’ పేరిట పలు ఫోన్లను ఆ కంపెనీ గతంలో తీసుకొచ్చింది. బిగ్ స్క్రీన్ కోరుకునేవారిని అవి ఎంతగానో ఆకట్టుకున్నాయి. 


ఇప్పుడు ఆ ఫోన్ల ఉత్పత్తిని కంపెనీ తాత్కాలికంగా నిలిపివేయన్నట్లు షియోమీ సీఈఓ లీ జూన్ తెలిపారు. మ్యాక్స్‌తో పాటు ఎంఐ నోట్‌ సిరీస్‌ నుంచి ఈ ఏడాది ఎలాంటి ఫోన్లనూ తీసుకురావడం లేదని ఆ కంపెనీ సీఈవో స్పష్టం చేశారు. అయితే, ఈ ఏడాది మాత్రమేనా? పూర్తిగానా? అన్నది స్పష్టత రాలేదు.

ప్రస్తుతానికి షామీ, రెడ్‌మీ బ్రాండ్లపై ప్రముఖంగా దృష్టి సారించినట్లు కంపెనీ సహ వ్యవస్థాపకుడు, సీఈవో అయిన లీ జున్‌ పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రస్తుతం ఎంఐ మ్యాక్స్‌, ఎంఐ నోట్‌ సిరీస్‌ ఫోన్లను తీసుకొచ్చే యోచన లేదని చెప్పారు. 

అంటే ఈ ఏడాదిలో మ్యాక్స్‌ గానీ, ఎంఐ నోట్‌ సిరీస్‌లో గానీ మార్కెట్లోకి రావు. వచ్చే ఏడాది మాత్రమే షియోమీ నుంచి మ్యాక్స్ సిరీస్ నుంచి గానీ, ఎంఐ నోట్ సిరీస్ నుంచి గానీ ఫోన్ వస్తుందన్నమాట. 

మరోవైపు కంపెనీ లక్ష్యాలను చూస్తుంటే ఈ ఫోన్ల ఉత్పత్తిని పూర్తిగా నిలిపేసినా ఆశ్చర్యపోనవసరం లేదు. చివరిగా షియోమీ నుంచి ఎంఐ మ్యాక్స్‌ 3, ఎంఐ నోట్‌ 3 ఫోన్లు వచ్చాయి. 

జున్‌ మాటలను బట్టి ఎంఐ సిరీస్‌లో ఫ్లాగ్‌షిప్‌ ఫోన్లను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. మిక్స్‌ సిరీస్‌లో హై ఎండ్‌ మొబైల్స్‌ను యథావిధిగా తీసుకొస్తారు. ఇటీవల సీసీ సిరీస్‌ను ప్రారంభించిన షామీ యువతే లక్ష్యంగా కొత్త ఫోన్లను తీసుకురానుంది. ఇవి ఎలా ఉండబోతున్నాయన్నది తెలియరాలేదు. ఇక రెడ్‌మీ బ్రాండ్‌లో బడ్జెట్‌ ధరల్లో ఫోన్లను కంపెనీ యథావిధిగా తీసుకురానుంది.
 

Follow Us:
Download App:
  • android
  • ios