Asianet News TeluguAsianet News Telugu

డిఫరెంట్ బ్రాండ్స్ జియోమీ & రెడ్ మీ:10న మార్కెట్లోకి రెడ్ మీ 48 ఎంపీ ఫోన్

భారతదేశంలో స్మార్ట్ ఫోన్లకు లభిస్తున్న ఆదరణతో అచ్చెరువొందిన చైనా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం జియోమీ.. కీలక నిర్ణయం తీసుకున్నది. ఎంఐ, రెడ్ మీ అనే పేర్లతో ఫోన్లు రూపొందిస్తున్న జియోమీ.. ఈ రెండింటిని ఇక నుంచి వేర్వేరు బ్రాండ్లుగా మార్కెట్లోకి తేనున్నది. బడ్జెట్ ఫోన్లు రెడ్ మీ.. హై ఎండ్  (ఎంఐ) ఫోన్లు జియోమీ తయారు చేస్తాయి.

Xiaomi, Redmi split to become different brands: Report
Author
New Delhi, First Published Jan 5, 2019, 10:31 AM IST

న్యూఢిల్లీ: దేశీయ మార్కెట్లో రెడ్‌మీ శ్రేణి స్మార్ట్‌ఫోన్ల విక్రయాలు విజయవంతం అయ్యాయి. దీంతో  రెడ్‌మీని ప్రత్యేక బ్రాండ్‌గా మార్చనున్నట్లు చైనా స్మార్ట్‌ఫోన్‌ తయారీ సంస్థ జియోమీ ప్రకటించింది. భారత్ మార్కెట్లోకి 2013 జులైలో అరంగేట్రం చేసిన రెడ్‌మీ.. వినియోగదారుల ఆకాంక్షలు, అవసరాలకు అనుగుణంగా బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్‌లతో దూసుకెళ్లింది.

బడ్జెట్ ఫోన్లపై రెడ్ మీ ఫోకస్
చైనాలో ఈ నెల 10న రెడ్‌మీ బ్రాండ్‌ కింద 48 మెగాపిక్సెల్‌ కెమేరా కలిగిన స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు సంస్థ వ్యవస్థాపకుడు లీ జున్‌ పేర్కొన్నారు. చైనా వార్తా సంస్థ గిజ్మో చైనా ఈ విషయాన్ని ధ్రువీకరించింది. రెడ్‌మీ, షియామీలపై ప్రత్యేక దృష్టి పెట్టడానికే వాటిని విడదీస్తున్నట్లు లీ జున్‌ చెప్పారు.‘రెడ్‌మీ బ్రాండ్‌ బడ్జెట్‌ స్మార్ట్‌ఫోన్లపై దృష్టి పెడుతుంది. ఇక ఎంఐ బ్రాండ్‌ ఖరీదైన (హై ఎండ్‌) ఫోన్లపై దృష్టి పెట్టనుపకపది. రెడ్‌మీ ఫోన్లు ఈ-కామర్స్‌ ప్లాట్‌ఫామ్‌లపై ఎక్కువగా విక్రయం అవుతున్నాయి. 

రిటల్ మార్కెట్ లోనే ఎంఐ విక్రయాలు 
రిటైల్ మార్కెట్లో ఎంఐ ఫోన్ల విక్రయాలు అధికంగా ఉన్నాయని జియోమీ వ్యవస్థాపకుడు లీ జున్ తెలిపారు. జియోమీకి చెందిన చౌక ధరల రెడ్‌మీ, రెడ్‌మీ నోట్‌ సిరీస్‌లకు భారతదేశంలో బహుళ ప్రాచుర్యం లభించింది. ఐడీసీ గణాంకాల ప్రకారం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం  మూడో త్రైమాసికంలో భారతదేశానికి జియోమీ 11.7 మిలియన్‌ ఫోన్లను ఎగుమతి చేసింది. భారత మార్కెట్‌లో జియోమీ 27.3 శాతం వాటా సాధించింది.


అత్యధిక బ్యాటరీ సామర్థ్యంతో జియోమీ పవర్ బ్యాంక్
చైనా ప్రముఖ ఎలక్ట్రానిక్ సంస్థ షావోమి సరికొత్త ఎంఐ పవర్ బ్యాంక్‌ను విడుదల చేసింది. యూఎస్బీ టైప్-సీ పోర్టు, 20,000 ఎంఏహెచ్ బ్యాటరీ సామర్థ్యం కల ఎంఐ పవర్ బ్యాంక్ 3 ప్రో ఎడిషన్‌ చైనా మార్కెట్‌లో ప్రవేశపెట్టాయి. ఎంఐ పవర్ బ్యాంకు 3 ప్రో ఎడిషన్ రూ. 2,000 లభిస్తోందని కంపెనీ తెలిపింది. 

11 నుంచి జియోమీ పవర్ బ్యాంక్ విక్రయాలు షురూ
చైనా మార్కెట్‌లో ఈ నెల 11వ తేదీ నుంచి అమ్మకాలు ప్రారంభమవుతాయని జియోమీ తెలిపింది. ఒక్కసారి పూర్తిగా చార్జింగ్ చేస్తే 11 గంటలపాటు పని చేస్తోందని సంస్థ పేర్కొంది. ఎంఐ పవర్ బ్యాంకు 3 ప్రో ఎడిషన్‌లో యూఎస్బీ టైపు-ఏ, 5వీ, 2.4ఏ, 9వీ, 2ఏ, 12వీ, 1.5ఓ, 50 వోల్ట్ ఫాస్ట్ చార్జింగ్, 45వోల్ట్ సపోర్టు పవర్ బ్రిక్ ఆప్షన్ తదితర ఫీచర్లు ఉన్నాయి.
 

Follow Us:
Download App:
  • android
  • ios