Asianet News TeluguAsianet News Telugu

48 ఎంపీ కెమెరా ఫ్లస్ అద్భుత ఫీచర్లతో షియోమీ రెడ్ మీ నోట్ 7ఎస్


చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ భారతదేశ మార్కెట్లోకి ‘రెడ్ మీ నోట్ 7ఎస్’ పేరిట మరో స్మార్ట్ ఫోన్ ను తెచ్చింది. 48 మెగా పిక్సెల్ కెమెరా గల ఈ ఫోన్ ధర రూ.10,999, రూ.12,999గా నిర్ణయించారు.

Xiaomi Redmi Note 7S with 48MP camera launched in India: Price, specifications, features
Author
New Delhi, First Published May 21, 2019, 10:56 AM IST

న్యూఢిల్లీ: చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ షియోమీ మరో మోడల్ మొబైల్‌ ఫోన్‌ను సోమవారం భారత విపణిలోకి విడుదల చేసింది. రెడ్‌మీ నోట్‌7ఎస్‌ పేరుతో దీన్ని తీసుకొచ్చింది. 48 మెగాపిక్సెల్‌ వెనుక కెమెరాతో వస్తుండటం ఈ ఫోన్‌ ప్రత్యేకత. ఇక ఇది రెండు వేరియంట్లలో లభించనుంది. 

3జీబీ ర్యామ్‌+32జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ సామర్థ్యం కలిగిన ఫోన్‌ ధర రూ.10,999. 4జీబీ ర్యామ్‌+64జీబీ ఇంటర్నల్‌ స్టోరేజ్‌ కలిగిన ఫోన్‌ రూ.12,999గా నిర్ణయించారు. బ్లూ, రుబీ రెడ్‌, బ్లాక్‌ రంగుల్లో ఇది లభ్యం కానుంది. 

ఈ నెల 23వ తేదీ మధ్యాహ్నం 12గంటలకు ఎంఐ.కామ్‌, ఫ్లిప్‌కార్ట్‌, ఎంఐ హోమ్స్‌లో ఇది విక్రయానికి రానుంది. ఆ మరుసటి రోజు నుంచి ఆఫ్‌లైన్‌లోనూ ఈ మొబైల్‌ను తేనున్నట్లు షియోమీ తెలిపింది. 

6.3 ఫుల్‌హెచ్‌డీ+ డిస్‌ప్లేతోపాటు గోరిల్లా గ్లాస్ -5 ప్రొటెక్షన్ ఉంటుంది. అలాగే రెడ్ మీ నోట్ 7 ఎస్ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్‌ 660 ప్రాసెసర్‌, ఆండ్రాయిడ్‌ పై, బ్యాక్ 48+5మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా సెటప్‌, రేర్ సెల్ఫీల కోసం 13 మెగాపిక్సెల్‌ కెమెరా అమర్చారు. ఇంకా 4000 ఎంఏహెచ్‌ బ్యాటరీ,  టైప్‌సీ పోర్ట్‌, క్విక్‌ఛార్జింగ్‌ 4.0 తదితర ఫీచర్లు ఉన్నాయి.

ఇటీవల ఇవే ప్రత్యేకతలతో రెడ్‌మి నోట్‌7 ప్రోను షియోమీ తీసుకొచ్చిన సంగతి తెలిసిందే. ఇందులోనూ 48+5మెగాపిక్సెల్‌ కెమెరా ఉంది. అయితే, ఇందులో స్నాప్‌డ్రాగన్‌ 675 ప్రాసెసర్‌ను వాడారు. అంతేకాకుండా 6జీబీ ర్యామ్‌ వేరియంట్‌లో కూడా ఈ ఫోన్‌ లభిస్తోంది. ఇక మిగిలిన ప్రత్యేకతలన్నీ ఒక్కటేనని షియోమీ తెలిపింది. ఇంకా రెడ్ మీ నోట్ 7 ఎస్ ఫోన్‌లో ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఏఐ ఫేస్ అన్ లాక్, డ్యూయల్ సిమ్ (హైబ్రీడ్ స్లాట్), వోల్ట్, పీ2ఐ స్ప్లాష్ రెసిస్టెంట్ కోటింగ్, ఐఆర్ బ్లాస్టర్ తదితర ఫీచర్లు ఉన్నాయి. 

Follow Us:
Download App:
  • android
  • ios