చౌకగా భారత విపణిలోకి రెడ్ మీ గో.. రూ.4,499లకే స్మార్ట్ ఫోన్

ఇతర స్మార్ట్ ఫోన్ మేజర్ల కంటే చైనా దిగ్గజం షియోమీ భారతదేశంలోని అన్ని రకాల వినియోగదారులను తన ఖాతాలో కలిపేసుకోవాలని తహతహలాడుతోంది. తాజాగా ఆవిష్కరించిన ఫోన్ అత్యంత చౌక ధరకే లభిస్తుంది. మరోవైపు డిజిటల్ పేమెంట్స్ విభాగంలోనూ అడుగులు పెట్టింది షియోమీ.

Xiaomi Redmi Go India Launch Today: How to Watch Live Stream, Expected Price, Specifications And More

చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ షియోమీ తాజాగా రెడ్‌మీ గో పేరిట భారత మార్కెట్లో కొత్త ఫోన్‌ ఆవిష్కరించింది. దీని ధర రూ. 4,499  ఉంటుంది. 1 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్‌ ఓరియో (గో ఎడిషన్‌) ఆపరేటింగ్‌ సిస్టం, ఐదంగుళాల హెచ్‌డీ డిస్‌ప్లే, 8 ఎంపీ రియర్‌ కెమెరా, 5 ఎంపీ సెన్సార్, క్వాడ్‌–కోర్‌ క్వాల్‌కామ్‌ స్నాప్‌డ్రాగన్‌ 425 చిప్‌ తదితరాలు ఇందులో ప్రత్యేకతలు. 

త్వరలో షియోమీ గో ఫోన్ కూడా భారత్ మార్కెట్లోకి రానున్నది. దాని ధర రూ.5000గా ఉంటుందని సంకేతాలిచ్చింది. భారతదేశంలో విడుదల చేసే షియోమీ నో మోడల్ ఫోన్ లో పలు రకాల ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి. 20 భాషల్లో డేటా లభిస్తుందని సంకేతాలిచ్చింది.

మరోవైపు, యూనిఫైడ్‌ పేమెంట్స్‌ ఇంటర్‌ఫేస్‌ (యూపీఐ) ఆధారిత చెల్లింపుల కోసం ’మీ’ పేమెంట్స్‌ యాప్‌ను కూడా షియోమీ ఆవిష్కరించింది. పేమెంట్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌గా ఐసీఐసీఐ బ్యాంకు వ్యవహరిస్తుందని తెలిపింది. 

కేవలం యూపీఐకి మాత్రమే పరిమితం కాకుండా డెబిట్‌ కార్డులు, క్రెడిట్‌ కార్డులు, ఇంటర్నెట్‌ బ్యాంకింగ్‌ ద్వారా కూడా చెల్లింపులు జరిపేందుకు ఈ యాప్‌ ఉపయోగపడుతుంది. త్వరలోనే ‘మి’ యాప్‌స్టోర్‌లో అందుబాటులోకి వస్తుందని షియోమీ తెలిపింది. షియోమీ అటు తమిళనాడులో మరో ప్లాంటును ప్రారంభించింది. దీంతో భారత్‌లో తమ ప్లాంట్ల సంఖ్య 7కు చేరినట్లు కంపెనీ పేర్కొంది. ఫాక్స్‌కాన్, ఫ్లెక్స్, హైప్యాడ్‌ సంస్థల భాగస్వామ్యంతో వీటిని ఏర్పాటు చేసినట్లు వివరించింది.  

డేటా భద్రతపై ఆందోళనలు వ్యక్తం అవుతున్న నేపథ్యంలో ఎంఐపే యాప్‌కు సంబంధించిన డేటా మొత్తాన్ని భారత్‌లోనే నిక్షిప్తం చేయనున్నట్లు జియోమీ ఇండియా చీఫ్‌ ఆపరేటింగ్‌ ఆఫీసర్‌ (సీఓఓ) మురళీకృష్ణన్‌ తెలిపారు. డిజిటల్‌ చెల్లింపుల సేవలందించేందుకు నేషనల్‌ పేమెంట్స్‌ కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) నుంచి కంపెనీ ఇప్పటికే అనుమతులు పొందింది.


 

Latest Videos
Follow Us:
Download App:
  • android
  • ios