న్యూఢిల్లీ‌: తక్కువ ధరకు అత్యాధునిక ఫీచర్లతో స్మార్ట్ ఫోన్లను తీసుకు వస్తూ, భారత మార్కెట్‌లో ప్రత్యేక స్థానం ఏర్పరచుకున్న దిగ్గజం రెడ్ మీ అనుబంధ షియోమీ. కస్టమ్‌ యూఐ ఫోన్లు వినియోగించేవారికి ఫీచర్లు అత్యంత సౌకర్యవంతంగా ఉంటాయి. 

అప్‌డేట్ విషయమై షియోమీ కాసింత నిదానమే
అప్‌డేట్‌ల విషయంలో షియోమీ కాసింత నిదానంగానే ముందుకు వెళుతుంది. గతంలో షియోమీ విడుదల చేసిన కొన్ని స్మార్ట్ ఫోన్లకు ఇక కొత్త అప్‌డేట్‌లు ఇవ్వబోమని తాజాగా ప్రకటించింది. ప్రస్తుతం చాలా షియోమీ స్మార్ట్ ఫోన్లు దాదాపు ఎంఐయూఐ-10పై పని చేస్తున్నాయి. 

రెడ్ మీ 4 సిరీస్ ఫోన్లకు నో అప్ డేట్స్
రెడ్‌ 4 సిరీస్‌, రెడ్‌ మీ 4ఏ, రెడ్‌మీ 3ఎస్‌, రెడ్‌మీ నోట్‌ 3, రెడ్‌మీ ప్రో మొబైల్స్‌కు కొత్త యూఐ అప్‌డేట్‌ ఇవ్వలేమని షియోమీ తేల్చేసింది. ఇప్పటికే బీటా వెర్షన్‌ ఉపయోగిస్తున్న వారందరూ స్టేబుల్‌ వెర్షన్‌కు అప్‌డేట్‌ అవ్వాలని సూచించింది.

స్నాప్ డ్రాగన్ 625 చిప్ సెట్ గల రెడ్ మీ ఫోన్లకు అప్ డేట్స్ యధాతథం
అయితే స్నాప్‌డ్రాగన్‌ 625 చిప్‌సెట్‌పై పనిచేసే రెడ్‌మి నోట్‌4కు మాత్రం ఎంఐయూఐ అప్‌డేట్స్‌ వస్తాయి. పైన పేర్కొన్న స్మార్ట్ ఫోన్లు వాడుతున్న వారు మాత్రం స్టేబుల్‌ వెర్షన్‌ను ఇన్‌స్టాల్‌ చేసుకోవాల్సి ఉంటుంది. 

అప్‌డేట్ రాని రెడ్ మీ ఫోన్లపై కొనసాగుతున్న అస్పష్టత
ఇప్పటికే ఎంఐయూఐ 10లో ప్రకటనలు విపరీతంగా వస్తూ వినియోగదారులను ఇబ్బంది పెడుతున్నాయి. త్వరలో విడుదల చేస్తూ ఎంఐయూఐ 11లో వాటిని తొలగిస్తామని కంపెనీ వెల్లడించగా, మరి అప్‌డేట్‌ రాని ఫోన్ల విషయంలో ఏం చేస్తారో చూడాలి. 

లీకైన గూగుల్‌ పిక్సల్‌ 3ఎ వివరాలు!
 గూగుల్‌ తయారు చేస్తున్న పిక్సల్‌ సిరీస్‌ ఫోన్‌ 3ఎ వివరాలను పొరబాటున తన వెబ్‌సైట్‌లో బయటపెట్టింది. ఈ ఫోన్‌ను గూగుల్‌ పిక్సల్‌ 3 రకానికి తేలికపాటి వెర్షన్‌ అని భావిస్తున్నారు. ఈ సంగతి గ్రహించిన గూగుల్‌ వెంటనే ఆ సమాచారాన్ని తొలగించింది. ఈ విషయాన్ని ది వైర్‌లో వెల్లడించింది.

ఈ ఏడాది మధ్యలో మార్కెట్‌లోకి గూగుల్ పిక్సల్ 3ఎ
గూగుల్ పిక్సల్ 3ఎ ఫోన్‌ ఈ ఏడాది మధ్యలో మార్కెట్లోకి రానున్నది. గూగుల్‌ ఐవో డెవలపర్‌ కాన్ఫరెన్స్‌లో దీనిని ప్రదర్శించవచ్చని భావిస్తున్నారు. సాధారణంగా గూగుల్‌ తన కొత్త ఉత్పత్తులను అక్టోబర్‌లో విడుదల చేస్తుంది. పిక్సల్‌ 3ఎ ఎక్స్‌ఎల్‌గా భావిస్తున్న ఈ ఫోన్‌ ఆండ్రాయిడ్‌ క్యూ ఆపరేటింగ్‌ సిస్టమ్‌తో వచ్చే అవకాశం ఉంది.