Asianet News TeluguAsianet News Telugu

వేలానికి 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ల్యాపీ.. 12 లక్షల మిలియన్ల డాలర్లు

ఆరు భయంకరమైన వైరస్‌లు ఉన్న శామ్‌సంగ్ ల్యాప్‌టాప్‌ వేలంలో ఉంది. సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ డిజైన్ చేసిన ఈ లాప్ టాప్‌లో ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు భారీ నష్టం చేకూర్చిన ఆరు వైరస్‌లు ఉన్నాయి. వైరస్ ల వల్ల నష్టాన్ని తెలిపేందుకే తమ ప్రయత్నం అని గ్వో ఓ డాంగ్ చెప్పారు. ప్రస్తుతం ఇది 12 లక్షల డాలర్లు పలుకుతోంది. ఔత్సాహికులెవరైనా వేలంలో పాల్గొనవచ్చు.  

World's Most Dangerous Laptop Is On Sale for $1.2 Million
Author
New Delhi, First Published May 28, 2019, 10:42 AM IST

న్యూఢిల్లీ: ప్రపంచంలో అత్యంత ప్రమాదకరమైన ల్యాప్‌టాప్‌ ఒకటి ఆన్‌లైన్‌ వేలంలో భారీ ధర పలుకుతోంది. ఆరు భయంకరమైన వైరస్‌లు ఈ  ల్యాప్‌టాప్‌లో తిష్టవేశాయి. అందువల్లే 'వరల్డ్స్ మోస్ట్ డేంజరస్’ల్యాప్‌టాప్‌గా పేరు తెచ్చుకుంది.  

ప్రపంచానికి భారీ నష్టాన్ని మిగిల్చిన అత్యంత ప్రమాదకరమైన ఆరు వైరస్‌లు ఇందులో ఉన్నాయి. ఈ వైరస్‌ వల్ల ప్రపంచంలో సుమారు 100 బిలియన్‌ డాలర్ల నష్టం వాటిల్లిందట. అలాంటి ల్యాప్‌టాప్‌ వేలమా? పైగా  అంత భారీ ధర పలకడమా? విచిత్రంగా ఉంది కదూ..  

సెక్యూరిటీ సంస్థ డీప్‌ ఇన్‌స్టింక్ట్‌ ఆధ్వర్యంలోనే గ్వో ఓ డాంగ్ అనే ఇంటర్‌నెట్‌ ఆర్టిస్ట్‌ ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు.  అతి ప్రమాదకరమైన ఆరు  వైరస్‌లను లైవ్లీగా ఉంచి మరీ, ఈ డివైస్‌ను  వేలానికి ఉంచారు. 

డిజిటల్‌ ప్రపంచానికి ఎదురవుతున్న ముప్పును భౌతికంగా ప్రజలకు తెలుపడమే తమ ప్రయత్న లక్ష్యం అని గ్వో  చెప్పారు.  కంప్యూటర్‌లోని భయంకరమైన వైరస్‌లు మనల్ని భౌతికంగా ప్రభావితం చేయలేవని చాలామంది ప్రజలు భావిస్తున్నారు. 

కానీ వైరస్‌లు ఆర్థికంగా ఎంత నష్టాన్ని కలుగజేస్తాయో గమనించలేక పోతున్నారని గ్వో ఓ డాంగ్ పేర్కొన్నారు. అందుకే ఆర్థికంగా భారీ నష్టాన్ని కలుగ జేసిన ఈ ఆరు భయంకరమైన వైరస్‌లను ఎంచుకున్నట్టు తెలిపారు. 

విండోస్‌ ఎక్స్‌పీ ఆధారిత శాంసంగ్‌ ఎన్‌సీ10 దీని పేరు.10.2 అంగుళాల 14జీబీ (2008) డివైస్‌ ఇది. వైఫై, ఫ్లాష్‌డ్రైవ్‌కి కనెక్ట్‌ చేయనంత వరకూ దీని నుంచి మిగతా పర్సనల్ కంప్యూటర్లకు ఈ వైరస్‌లకు వ్యాపించకుండా  జాగ్రత్తలు తీసుకున్నామని నిర్వాహకులు చెప్పారు. 

ఐ లవ్‌యూ, మైడూమ్‌, సోబిగ్‌, వాన్నా క్రై, డార్క్ టెక్విలా బ్లాక్ఎనర్జీ అనే ఆరు వైరస్‌లు ఈ ల్యాప్‌టాప్‌లో దాగి ఉన్నాయి.  'ది పెర్సిస్టెన్స్ ఆఫ్ ఖోస్' అనే శీర్షికతో,  గ్వోఓ ఓ డోంగ్‌ దీన్ని సృష్టించారు.  

ఆన్‌లైన్‌ ద్వారా నిర్వహిస్తున్న ప్రైవేట్ వేలంలో ఇది ఇప్పటికే 1.2 మిలియన్‌ డాలర్లు (సుమారు రూ.8 కోట్ల, 34 లక్షలు) ధర పలుకుతోంది. అద్భుతమైన ఈ ఆర్ట్‌పీస్‌పై ఆసక్తి వున్నవారు ఎవరైనా ఈ వేలంలో పాల్గొనవచ్చు. 

Follow Us:
Download App:
  • android
  • ios