ప్రముఖ మెసేజింగ్ యాప్.. వాట్సాప్ మరో సరికొత్త ఫీచర్ ని వినియోగదారుల ముందుకు తీసుకువస్తోంది. ‘ ప్రివ్యూ’ పేరిట సరికొత్త ఆప్షన్ ని తీసుకువస్తోంది. మనం ఏదైనా మెసేజ్ ని ఫార్వర్డ్ చేసేటప్పుడు.. ఈ ప్రివ్యూ ఆఫ్షన్ ద్వారా మరోసారి దానిని ప్రివ్యూ చేసుకోవచ్చు.

మెసేజ్, ఫోటో, వీడియో, జిఫ్ ఫైల్.. ఇలా ఏదైనా సరే.. మీ వాట్సాప్ లోని స్నేహితులకు ఫార్వర్డ్ చేసేటప్పుడు మరోసారి చెక్ చేసుకోవడానికి ఈ ఆప్షన్ ఉపయోగపడుతుంది. అలా ప్రివ్యూ చేసుకున్నాక.. పంపించాలనుకుంటే పంపవచ్చు.. వద్దు అనేకుంటే ఆగిపోవచ్చు. 

మెసేజ్ ని ప్రివ్యూ చేసే సమయంలో ఫార్వర్డ్ జాబితాను మార్చుకునే అవాకశం ఉంది. అయితే.. ఈ ఫీచర్ ఇద్దరు లేదా అంతకంటే ఎక్కువ మందికి ఏదైనా మెసేజ్ ఫార్వర్డ్ చేసినప్పుడు మాత్రమే ఉపయోగపడుతుంది.  ప్రస్తుతం టెస్టింగ్ దశలో ఉన్న ఈ ఫీచర్.. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది.