Asianet News TeluguAsianet News Telugu

వాట్సప్ మెసేజ్ తొలగింపు గడువు పెంపు ఇలా..

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్  యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. మెసేజ్‌లను డిలీట్‌ చేసే గడువును భారీగా పొడిగించింది. పొరపాటున ఇతరులకు పంపిన మెసేజ్‌ను కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా

WhatsApp Reportedly Tweaks How Delete for Everyone Feature Works
Author
Mumbai, First Published Oct 16, 2018, 8:22 AM IST

ప్రముఖ సోషల్ మీడియా నెట్‌వర్క్ వాట్సాప్  యూజర్లకు మరో వెసులుబాటును కల్పించింది. మెసేజ్‌లను డిలీట్‌ చేసే గడువును భారీగా పొడిగించింది. పొరపాటున ఇతరులకు పంపిన మెసేజ్‌ను కొంత సమయంలోపే డిలీట్ చేయాల్సి ఉంటుంది కదా! ఈ అంశంలోనే వినియోగదారులకు భారీ ఊరట కల్పించనున్నది. ఈ మేరకు తాజాగా ఈ ఫీచర్‌లో మరో మార్పు తేనున్నది. 

గతేడాది కొత్త ఫీచర్‌ "డిలీట్ ఫర్ ఎవ్రీవన్"ప్రవేశ పెట్టిన సంగతి తెలిసిందే. సోషల్ మీడియా వేదిక వాట్సప్‌లో నూతన ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. ఒక వేళ ఏదైనా మెసేజ్ పంపాల్సిన గ్రూప్ లేదా కాంటాక్ట్‌కు కాక మరో గ్రూపు లేదా కాంటాక్ట్‌కు పంపితే ఆ  మెసేజ్‌ను అవతల వ్యక్తి చూసుకోనంత వరకు అంటే 13 గంటల 8 నిమిషాల 16 సెకన్ల వరకు ఎప్పుడైనా డిలీట్‌ చేయవచ్చు.

ఇప్పటివరకు వాట్సప్ నుంచి సెండ్‌ చేసిన సందేశాలను 68 నిమిషాల లోపు మాత్రమే తొలగించే అవకాశం ఉంది. తాజా అప్‌డేట్‌ ప్రకారం డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ ఫీచర్ వినియోగించి మెసేజ్‌ను డిలీట్ చేసుకోవచ్చని వాట్సాప్‌ పర్యవేక్షక వాబిటెయిన్ ఇన్ఫో వెబ్‌సైట్ తెలిపింది. సాధారణంగా ఇది అవతల వ్యక్తి ఫోన్ స్విఛ్చాఫ్ చేసి పెట్టుకున్నప్పుడు మాత్రమే జరుగుతుందని తెలిపింది.
 

Follow Us:
Download App:
  • android
  • ios