ఆపిల్ ఐఫోన్ నుంచి వాట్సాప్ గోల్డ్ పేరిట మెసేజ్‌లు పంపుతూ ఫోన్ల వినియోగదారుల ఖాతాల నుంచి వివరాలు తెలుసుకుని రూ.కోట్లలో డబ్బులు కాజేస్తున్నారు. కనుక ఫోన్ల వినియోగదారులు అప్రమత్తంగా వ్యవహరించాలని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు.
న్యూఢిల్లీ: సైబర్ నేరస్థుల ఆగడాలు మితిమీరుతున్నాయి. కొత్త పద్దతులకు తెరతీస్తూ మాల్వేర్ వైరస్ల వ్యాప్తిని మరింత తీవ్రతరం చేస్తున్నాయి. ఫోన్ సంస్థల అధికారిక నంబర్ల నుంచి కాల్స్ చేసి, తాజా అప్డేట్ వెర్షన్ అని ఫోన్ డేటాను దొంగిలించడం ఇందులో భాగమే!
'ధనవంతుల కోసం ప్రత్యేకంగా రూపొందించబడిన 'వాట్సాప్ గోల్డ్' వెర్షన్ లీక్ అయింది. మీకు కూడా ఆ సేవలు ఉచితంగా కావాలంటే, ఈ లింక్ పైన ఉన్న క్లిక్ చేయండి' అని 2016లో 'వాట్సాప్ గోల్డ్' పేరిట వైరల్ అయిన మాల్వేర్ మెసేజ్‌లు ప్రస్తుతం మళ్ళీ చక్కర్లు కొడుతున్నాయి.
మెసేజ్ సారాంశం మాత్రం మారింది. ఏదో యూజర్‌కు మేలు చేస్తున్నట్టు, మరుసటి రోజు విడుదల కాబోతున్న మాల్వేర్ వీడియో నుంచి అలర్ట్ చేస్తున్నట్టు పేర్కొంటున్న ఈ భయంకరమైన వైరస్ మెసేజ్ ఇప్పుడు మళ్ళీ పంజా విసురుతోంది.
'వాట్సాప్ గోల్డ్' పేరుతో వచ్చే ఎటువంటి లింక్స్‌పై క్లిక్ చేయొద్దని, సైబర్ నేరగాళ్లు సృష్టించిన ఈ వైరస్ ఫోన్లో చేరితే, ఫోన్లో నిక్షిప్తమైన వ్యక్తిగత వివరాలు, కాంటాక్ట్స్, బ్యాంక్ అకౌంట్, క్రెడిట్ కార్డు ఇలా ఫోన్ డేటా అంతా సైబర్ నేరగాళ్ల చేతుల్లోకి వెళ్ళిపోయే ప్రమాదం పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
ఆపిల్ ఐఫోన్ ప్రమాదం బారిన పడటం ఉండదని, మాల్వేర్ ప్రభావితం సదరు మొబైల్ ఫోన్‌పై పనిచేయదని చాలా మంది భావిస్తారు. ఏకంగా ఆపిల్ అఫీషియల్ కస్టమర్ కేర్ ఫోన్ నంబర్ నుంచే వినియోగదారులకు వాయిస్ ఆధారిత మెసేజ్ లు, కాల్స్ వస్తుండటం ఇటీవల ఎక్కువవుతోంది. నిజంగా, అవి కంపెనీ నుంచి వచ్చే కాల్స్, మెసేజ్‌లు ఐతే పర్వాలేదు. కానీ, వాటిని చేస్తున్నది సైబర్ నేరగాళ్ళని ఇటీవల తేలింది.
వాయిస్ ఫిషింగ్ కాల్ వస్తూనే, కాల్ బ్యాక్ చేయమనే మెసేజ్ కూడా యూజర్ ఫోన్లోకి వస్తోంది. సదరు నంబర్‌కు కాల్ బ్యాక్ చేస్తే, యూజర్ల ఫోన్ డేటా నేరగాళ్ల చేతుల్లోకి వెళ్తుంది. యూజర్ ఫోన్ డేటా దొంగిలించడానికే ఈ వాయిస్ ఫిషింగ్‌కు దుండగులు పాల్పడుతున్నట్టు సైబర్ నిపుణులు చెబుతున్నారు. కాగా, గత సంవత్సరం వీవీఐపీ ఐఫోన్లే టార్గెట్ గా, ఓ మిస్టరీ మాల్వేర్ ఇండి యాపై అటాక్ చేసినట్టు సిస్కో టాలోస్ కమర్షియల్ థ్రెట్ ఇంటెలిజెన్స్ గ్రూప్ మాల్వేర్ రీసెర్చర్లు, అనాలిస్టులు పేర్కొనడం విదితమే!
Read Exclusive COVID-19 Coronavirus News updates, from Telangana, India and World at Asianet News Telugu.
వర్చువల్ బోట్ రేసింగ్ గేమ్ ఆడండి మిమ్మల్ని మీరు ఛాలెంజ్ చేసుకోండి ఇప్పుడే ఆడటానికి క్లిక్ చేయండి
Last Updated Jan 7, 2019, 4:45 PM IST