ప్రముఖ టెలికాం కంపెనీ వొడాఫోన్.. మరో ప్రీపెయిడ్ ప్లాన్ ని ప్రవేశపెట్టింది. ఇతర టెలికాం సంస్థల నుంచి వస్తున్న పోటీని తట్టుకునేందుకు ఎప్పటికప్పుడు కొత్త కొత్త ప్లాన్ లను, ఆఫర్లను ప్రవేశపెడుతున్న వొడాఫోన్.. మరోసారి ఇలాంటి ప్లాన్ నే తీసుకువచ్చింది.

ముఖ్యంగా  ఎక్కువ రోజుల వాలిడిటీతో  రూ.200వందల లోపు ఈ ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను తీసుకొచ్చింది. రూ.189ల ప్రీపెయిడ్‌ ప్లాన్‌ను కస్టమర్లకు అందుబాటులో ఉంచింది. 

 రూ. 189ల ప్లాన్‌ అన్‌లిమిటెడ్‌ కాలింగ్, 2జీ డేటా ప్రయోజనాలను వోడాఫోన్‌ అందిస్తోంది.  అయితే ఎస్‌ఎంఎస్‌ల ఆఫర్‌ లేదు. అలాగే  కాల్స్‌  వినియోగంలో కూడా పరిమితులు విధించింది. ఫెయిర్‌ యూసేజ్‌ పాలసీ ప్రకారం రోజువారీ 250 నిమిషాలు, వారానికి 1,000 నిమిషాలు వాడుకునేలా నిబంధన విధించింది. అంటే  వాయిస్‌ కాలింగ్‌లో ఈ పరిమితి దాటితే  సెకనుకు పైసా చొప్పున చార్జ్‌ చేయనుంది.  

ఈ ప్లాన్‌ వాలిడిటీ 56 రోజులు. జియో, ఎయిర్‌టెల్‌, ఐడియా అందిస్తున్న ఈ తరహా ప్లాన్‌లు అన్నీ రూ.200కు పైనే వసూలు చేస్తున్నాయి. జియో 198 రూపాయల ప్లాన్లో 56జీబీ 4జీ డేటా, అన్‌లిమిటెడ్‌   కాలింగ్‌ సదుపాయం. రోజుకు 100ఎంఎస్‌ఎస్‌లు ఆఫర్‌ చేస్తోంది. అయితే ప్లాన్‌ వాలిడిటీ మాత్రం రూ.28రోజులు. 
 
ఇటీవల రూ.279 ప్రీపెయిడ్ ప్లాన్‌ను ప్రవేశపెట్టింది. అన్‌లిమిటెడ్ కాల్స్, 4జీబీ 4జీ/3జీ డేటా ఆఫర్‌ చేస్తోంది. ఇందులో కూడా ఎస్‌ఎంఎస్‌ ఆఫర్‌ లేదు.  ప్లాన్ వాలిడిటీ 84 రోజులు.  మరోవైపు జియో అందిస్తున్న  84 రోజుల వాలిడిటీ   ఉన్న రూ.399 ప్లాన్‌లో కస్టమర్లకు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాల్స్ వినియోగించుకోవచ్చు.