టెలికాం రంగంలో జియో, ఎయిర్ టెల్ లు ఆఫర్ల మీద ఆఫర్లతో పోటీలు పడుతున్నాయి. వాటి పోటీని తట్టుకునేందుకు వొడాఫోన్ కూడా ప్రత్యేక ఆఫర్లను తీసుకువస్తోంది. ఇందులో భాగంగానే వొడాఫోన్ సరికొత్త ప్లాన్ ని ప్రవేశపెట్టింది. కాకపోతే ఈ ప్లాన్ లో కొన్ని ట్విస్ట్ లను కూడా వొడాఫోన్ జోడించింది.

ప్రీపెయిడ్‌ కస‍్టమర్లకోసం  597 రూపాయల రీఛార్జ్ ప్యాక్‌ను లాంచ్‌ చేసింది.  ఇందులో అన్‌లిమిటెడ్‌  వాయిస్‌కాల్స్‌, 10జీబీ డేటా, రోజుకు 100ఎస్‌ఎంఎస్‌లు అందిస్తోంది. జియో, ఎయిర్‌టెల్‌ కంపెనీలను దెబ్బకొట్టేలా వోడాఫోన్‌ కొత్త ప్రీపెయిడ్ ప్లాన్‌ తీసుకొచ్చింది. 

అయితే ఈ ప్లాన్‌లో దుర్వినియోగం నివారించడానికంటూ కొన్ని పరిమితులు విధించడం  విశేషం.  ముఖ్యంగా వాయిస్ కాలింగ్‌లో పరిమితి పెట్టింది.  రోజుకు 250 నిమిషాలు,  వారానికి 1000 నిమిషాలకు మాత్రమే కాల్స్‌ పరిమితం.  అంతేకాదు మొత్త వాలిడిటీ పీరియడ్‌లో 100  యూనిక్‌ నెంబర్లకు మాత్రమే కాల్‌ చేసుకునే అవకాశం ఉంది.  అంతేనా..ఇక్కడ ఇంకో ట్విస్ట్ కూడా వుంది. ఈ ప్లాన్ వాలిడిటీస్మార్ట్‌ఫోన్‌ వినియోగదారుల కోసం 112 రోజులు, ఫీచర్ ఫోన్ వినియోగదారులకయితే 168 రోజులుగా  నిర్ణయించింది.