ఇక నుంచి ఐడియా, వొడాఫోన్ ఒకటే

First Published 31, Aug 2018, 2:50 PM IST
Vodafone completes merger with Idea, creates India's largest mobile operator
Highlights

15ఏళ్లపాటు  నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే  సీఈవోగా బాలేష్ శర్మ నియమించారు. 

ప్రముఖ టెలికాం సంస్థలైన ఐడియా, వొడాఫోన్ లు ఇప్పుడు వేరే వేరు కాదు. ఈ రెండు కంపెనీలు పూర్తిగా ఒక్కటయ్యాయి. వీటి కంపెనీ పేరు కూడా పూర్తిగా మారిపోయింది. రెండింటినీ కలిపి వోడాఫోన్ ఐడియా లిమిటెడ్ పేరుతో పిలవనున్నారు. దీంతో ఇది భారత్‌లో అత్యంత పెద్ద టెలికం సర్వీస్ ప్రొవైడర్‌గా నిలిచింది. మొన్నటి వరకు ఎయిర్ టెల్ అతి పెద్ద టెలికాం సర్వీస్ గా ఉండేది. ఇప్పుడు ఈ రెండు కంపెనీలు ఒక్కటవ్వడంతో.. ఎయిర్ టెల్ వెనక్కి తగ్గాల్సి వచ్చింది.

32.2శాతం వాటా, 408 మిలియన్ల వినియోగదారులతో  అగ్రగామి సంస్థగా నిలిచింది.  దీంతో 15ఏళ్లపాటు  నెంబర్ వన్ స్థానంలో ఉన్న ఎయిర్ టెల్ ఇప్పుడు ఆ స్థానాన్ని కోల్పోయింది. ఆదిత్య బిర్లా గ్రూప్‌ ఛైర్మన్‌ కుమార్ మంగళం బిర్లా ఈ విలీన సంస్థకు ఛైర్మన్‌గా ఉంటారు. అలాగే 12 మంది డైరెక్టర్లతో (6 స్వతంత్ర డైరెక్టర్లు సహా) కొత్త బోర్డు ఏర్పాటు చేశారు. అలాగే  సీఈవోగా బాలేష్ శర్మ నియమించారు. 

 ఈ మేరకు  ఇరు సంస్థలు శుక్రవారం ఒక అధికారిక ప్రకటన విడుదల చేశాయి. దీంతో దేశవ్యాప్తంగా 15,000 దుకాణాలను, 1.7 మిలియన్ల రిటైల్ టచ్‌ పాయింట్లు వొడాఫోన్‌ ఐడియా సొంతం. దేశంలో అతిపెద్ద సస్థగా అవతరించి చరిత్ర సృష్టించామని  చైర్మన్‌ కుమార మంగళం వ్యాఖ్యానించారు. పరిణామం చెందుతున్న డిజిటల్, కనెక్టివిటీ అవసరాలను నెరవేర్చడానికి కొత్త ఉత్పాదనలు, సేవలతో తమ రిటైల్, వాణిజ్య కస్టమర్లకు అద్భుతమైన అనుభవాన్ని అందించనున్నామని  కొత్త సంస్థ  సీఈవో బాలేష్ శర్మ చెప్పారు. భారతదేశం అంతటా తొమ్మిది సర్కిళ్లలో కొత్త సంస్థ మొదటి స్థానంలో ఉందని వెల్లడించారు. అలాగే ఐడియా సెల్యులార్ మేనేజింగ్ డైరెక్టర్ పదవినుంచి  హిమాంశు కపానియా నేడు(ఆగస్టు 31, 2018) వైదొలగనున్నారు.  కానీ కొత్త కంపెనీలో నాన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్‌గా ఉంటారు.

మరోవైపు రెండవ అతిపెద్ద సంస్థగా ఉన్న వొడాఫోన్ జూలైలో రికార్డు స్థాయిలో ఏకంగా 6 లక్షలకు పైగా కొత్త కస్టమర్లను ఖాతాదారులుగా చేర్చుకుంది. ప్రత్యర్థి కంపెనీలతో పోలిస్తే ఇదే అత్యధికం.  మార్కెట్ లీడర్ భారతీ ఎయిర్‌టెల్ 3.13 లక్షల మందిని ఖాతాదారులుగా చేర్చుకుంది. జూలైలో వొడాఫోన్ ఇండియా 609,054 మందిని ఖాతాదారులుగా చేర్చుకోగా, భారతీ ఎయిర్‌టెల్ 313,284 మందిని చేర్చుకున్నట్టు సెల్యూలార్ ఆపరేటర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (సీఓఏఐ)  వెల్లడించింది. కొత్త వినియోగదారుల చేరికతో వోడాఫోన్‌ మొత్తం సబ్‌స్క్రైబర్ల సంఖ్య 1004.08 మిలియన్లకు చేరుకుందని తెలిపింది. అయితే  ఐడియా సెల్యులార్ వినియోగదారుల బేస్ కేవలం 5,489 మాత్రమే పెరిగింది.

loader