హైదరాబాద్: తమ వినియోగదారులకు చైనాకు చెందిన ప్రముఖ మొబైల్ తయారీ సంస్థ వివో శుభవార్త అందించింది. ఇండియా మార్కెట్‌లో వివో వీ9 స్మార్ట్‌ఫోన్ అమ్మకాలు ప్రారంభమయ్యాయని కంపెనీ పేర్కొంది. అమెజాన్, వివో ఈ- స్టోర్లు, భారత్‌లో ఉన్న అన్ని వివో ఆఫ్‌లైన్ స్టోర్లలో ఈ ఫోన్ అందుబాటులో ఉంటుందని వివో సంస్థ తెలిపింది. రిలయన్స్ జియోతో ఒప్పందం చేసుకొని ప్రత్యేక ఆఫర్లు ఇచ్చినట్లు వివో కంపెనీ ప్రకటించింది. 

వివో వీ9 స్మార్ట్‌ఫోన్లపై రూ. 2000 వరకు డిస్కౌంట్ ఇవ్వడంతో వివో వీ9 స్మార్ట్‌ఫోన్ 17,990 లభించనుంది. వివో వీ9 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసిన సమయంలో ఈ ఫోన్ ధర రూ. 19,990గా నిర్ణయించారు. వివో వీ9 ఫోన్ కొనుగోలు దారులకు ఈ నెల 29వ తేదీ నుంచి ఆఫ్ లైన్ విక్రయాల్లో ఇదే రాయితీని అందుబాటులోకి తెచ్చారు. 

6జీబీ ర్యామ్, డ్యుయల్ రేర్ కమెరా సెటప్, 19.9 ఫుల్ వ్యూ డిస్ ప్లే తదితర ఫీచర్లు వీవో వీ9 మోడల్ స్మార్ట్ ఫోన్లలో అందుబాటులో ఉన్నాయి. రూ.2000 వరకు రాయితీ అమలుకు గడువు అనేది వివో వీ9 మోడల్ స్మార్ట్ ఫోన్ సంస్థ నిర్ణయించింది. వీవో వీ9 మోడల్ స్మార్ట్ ఫోన్ భారత్ మార్కెట్లో కేవలం బ్లాక్ కలర్ ఆప్షన్ తో విడుదల చేస్తున్నట్లు సంస్థ యాజమాన్యం వివరణ ఇచ్చింది. 

రిలయన్స్ జియోతో పార్టనర్ షిప్ వల్ల ఇన్ స్టంట్ క్యాష్ బ్యాక్ రూ.1950, థర్డ్ పార్టీ డిస్కౌంట్ కూపన్ల రూపేణా రూ.2,100 వరకు వివో  వీ9 మోడల్ స్మార్ట్ ఫోన్ కొనుగోలుదారులకు లభిస్తాయి. రూ.50తో మొత్తం 39 జియో డిస్కౌంట్ ఓచర్లు, రూ.198 విలువైన జియో రీచార్జి ప్యాక్ లభిస్తుంది. 

వీటితోపాటు 25 % స్విగ్గి డిస్కౌంట్ కూపన్ (క్రికెట్ మ్యాచ్ ల్లో రూ.150 వరకు పరిమితి అమలులో ఉంది), మూడు పేటీఎం మూవీ టిక్కెట్లపై 15 శాతం క్యాష్ బ్యాక్ ఓచర్లు (రూ.150 వరకు పరిమితి), 12 నెలల పాటు కాంప్లిమెంటరీ సబ్ స్క్రిప్షన్ లభిస్తుంది. ఇంకా హెచ్డీఎఫ్సీ బ్యాంక్ డెబిట్ లేదా క్రెడిట్ కార్డుల కొనుగోళ్లపై ఐదు శాతం క్యాష్ బ్యాక్ ఆఫర్ అనదంగా లభిస్తుంది. పేటీఎం మాల్ ద్వారా ఫోన్ కొనుగోలు చేస్తే రూ.2000 వరకు క్యాష్ బ్యాక్ కూపన్ పొందొచ్చు.

మరో కొత్త ఆఫర్ ప్రకటించిన బీఎస్ఎన్ఎల్
తమ వినియోగదారులను ఆకట్టుకునేందుకు ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ మరో సరికొత్త ఆఫర్ ప్రకటించింది. దీపావళి  సందర్భంగా మూడు రీచార్జ్ ప్యాక్‌లపై 9 శాతం అదనంగా టాక్- టైమ్ ఆఫర్ ఇస్తున్నట్లు కంపెనీ పేర్కొంది. ఈ ఆఫర్ ఈ నెల 25 నుంచి నవంబర్ 11వ తేదీ వరకు అందుబాటులో ఉంటుందని బీఎస్ఎన్ఎల్ కంపెనీ స్పష్టం చేసింది. రూ. 180, రూ. 410, రూ. 510 ప్లాన్‌తో రీచార్జ్ చేసుకున్న వినియోగదారులకు ఎక్స్‌ట్రా టాక్-టైమ్ లభిస్తోందని సంస్థ తెలిపింది. ఈ ఆఫర్ ఇండియాలో ఉన్న అన్ని సర్కిళ్లలో వర్తిస్తుందన్నారు. ప్లాన్ రూ. 180 రీచార్జ్‌తో 5.5 శాతం ఎక్స్‌ట్రా టాక్-టైమ్, ప్లాన్ రూ. 410 రీచార్జ్‌తో 7.3 శాతం ఎక్స్‌ట్రా టాక్-టైమ్, ప్లాన్ రూ. 510 రీచార్జ్‌తో 9 శాతం ఎక్స్‌ట్రా టాక్-టైమ్ లభించనుంది.