Asianet News TeluguAsianet News Telugu

బైట్ డాన్స్ నుంచి ‘టిక్‌టాక్‌’ స్మార్ట్‌ఫోన్‌

చైనా ‘టిక్ టాక్’ యాప్ తయారీ సంస్థ బైట్ డ్యాన్స్ మార్కెట్లోకి సొంత స్మార్ట్ ఫోన్ తెచ్చేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇందుకోసం చైనా స్మార్ట్ ఫోన్ మేకర్ ‘స్మార్టిసన్’ నుంచి పేటెంట్ హక్కులు పొందినట్లు సమాచారం.

TikTok's creator is reportedly making a smartphone
Author
New Delhi, First Published May 29, 2019, 10:26 AM IST

న్యూఢిల్లీ : యువతను కట్టిపడేస్తున్న ‘టిక్‌టాక్‌’ యాప్‌కు రోజురోజుకి ఆదరణ పెరిగిపోతోంది. ఫొన్‌లో ఈ యాప్‌ ఉందంటే చాలు.. చిన్నాపెద్ద తేడా లేకుండా ఎక్కువ సేపు టిక్‌టాక్‌ వీడియోలను చూస్తూ ఉంటారు. 

టిక్ టాక్ యాప్‌ నుంచి స్టార్ట్‌ఫోన్‌ కూడా రానున్నదన్న వార్తలు ఇప్పుడు వినియోగదారులను మరింత సంతోషానికి గురిచేస్తున్నాయి.టిక్‌టాక్‌ మాతృసంస్థ  ‘బైట్‌డ్యాన్స్‌’ సొంత స్మార్ట్‌ఫోన్‌ తయారీలో నిమగ్నమైందని సమాచారం. 

సొంత స్మార్ట్ ఫోన్ తయారు చేయడం కోసం చైనా స్మార్ట్ ఫోన్ల తయారీ సంస్థ ‘స్మార్టిసన్’ నుంచి ఏడాది ప్రారంభంలోనే పేటెంట్, టాలెంట్ హక్కులను బైట్ డాన్స్ పొందినట్లు వినికిడి. ‘టిక్‌టాక్‌ ఫోన్‌’గా నామకరణం చేసిన ఈ డివైజ్‌లో టిక్‌టాక్‌తోపాటు బైట్‌డ్యాన్స్‌ యాప్స్‌ కూడా ఉండనున్నాయి.

స్మార్ట్‌ఫోన్‌ రంగంలోకి అడుగుపెట్టాలని బైట్‌డ్యాన్స్‌ సీఈవో జాంగ్‌ యిమింగ్‌ దీర్ఘ కాలిక ప్రణాళికలో ఉన్నారని పలు మీడియా కథనాలు పేర్కొన్నాయి. దీనిపై బైట్ డాన్స్ సంస్థ అధికారికంగా స్పందించేందుకు నిరాకరించింది. 

అయితే టిక్‌టాక్‌ యాప్‌ ఇటీవల భారత్‌లో కొన్ని రోజులు నిషేధానికి గురైన విషయం తెలిసిందే. యువత, చిన్నపిల్లలపై ప్రభావం చూపించే అశ్లీల వీడియోలను తొలగించడంలో ఆ యాప్‌ విఫలమైనందున భారత్‌లో దాన్ని నిషేధించాలని పలువురు కోర్టుకెక్కారు. అయితే ఈ నేపథ్యంలో టిక్‌టాక్‌ ఫోన్‌ యువతను ఏమేరకు ఆకట్టుకుంటుందో చూడాలి.

బైట్ డాన్స్ సంస్థకు కొన్ని అడ్వాంటేజెస్ ఉన్నాయి. కస్టమర్లకు అవసరమైన సేవలందించడంలో శరవేగంగా స్పందిస్తోంది. ఈ ఫోన్‌ను నార్త్ అమెరికా, యూరప్ దేశాల్లో కంటే చైనాలోనే విడుదల చేయాలని సంకల్పించినట్లు తెలుస్తోంది. 

గతంలో ఇంటర్నెట్ కంపెనీ ఆవిష్కరించిన ఫోన్ పూర్తిగా ఫ్లాప్ అయింది. ఆ సంస్థ తరుచుగా వినియోగదారులకు పూర్తిగా సేవలందించడంపైనే కేంద్రీకరిస్తుంది. ఆన్ లైన్ రిటైల్ దిగ్గజం ‘అమెజాన్’ ఫైర్ ఫోన్ ఆ సంస్థ స్టోర్ ఫ్రంట్‌ విభాగంలో గ్లోరీఫై అయింది. ఇక ఫేస్ బుక్ ఆశీస్సులతో వచ్చిన హెచ్ టీసీ ఫస్ట్ స్టాండర్డ్ ఫేస్ బుక్ యాప్ వాడటం కోసం వినియోగదారులకు ఫైన్ చెల్లించాల్సి వచ్చింది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios