సోషల్ మీడియా దిగ్గజం, ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ వినియోగదారులను గందరగోళానికి గురిచేస్తుంది. వాట్సాప్ తాజాగా వినియోగదారుల కోసం ఒక కొత్త ప్రైవసీ పాలసీని రూపొందించింది,  ఇది ఫిబ్రవరి 8 నుండి అమలులోకి రానున్న సంగతి మీకు తెలిసిందే.

 అయితే వాట్సాప్ కొత్త ప్రైవసీ విధానం ఇతర యాప్స్ కి ప్రయోజనం చేకూరుస్తుందని ఊహించలేదు, కానీ ఇప్పుడు అలాంటిదే జరుగుతుంది. దేశీయ యాప్ టెలిగ్రామ్ వాట్సాప్ కొత్త  పాలసీ నుండి అధిక ప్రయోజనం పొందుతున్నట్లు తెలుస్తుంది. సిగ్నల్ యాప్ కూడా వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీని ఉపయోగించుకుంటుంది.

72 గంటల్లో 2.5 కోట్ల డౌన్‌లోడ్‌లు
వాట్సాప్ కొత్త ప్రైవసీ పాలసీ నుండి టెలిగ్రామ్ కు భారీ ప్రయోజనం పొందుతుంది అని వెల్లడైంది, కేవలం 72 గంటల్లో 2.5 కోట్ల మంది కొత్త వినియోగదారులు టెలిగ్రామ్‌ డౌన్‌లోడ్‌లు చేసుకున్నారు. వీరిలో చాలా వరకు వాట్సాప్ నుండి టెలిగ్రామ్‌ కి  మారినవారే ఎక్కువ.

ఈ సమాచారాన్ని టెలిగ్రామ్ వ్యవస్థాపకుడు పావెల్ దురోవ్ స్వయంగా తెలిపారు. జనవరి మొదటి వారంలో టెలిగ్రామ్‌లో 500 మిలియన్ల నెలవారీ యాక్టివ్ యూజర్లు ఉన్నారని, తరువాతి వారంలో అంటే కేవలం 72 గంటల తరువాత ఇది 52.5 కోట్లకు పెరిగిందని డారోవ్ చెప్పారు. 

also read ఒకప్పుడు కారు రిపైర్ కి కూడా డబ్బులు లేవు.. కానీ ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడు.. ...

టెలిగ్రామ్ యాప్ లక్షణాలు

వాట్సాప్ లాగానే టెలిగ్రామ్ కూడా ఒక మల్టీమీడియా మెసేజింగ్ యాప్, దీనిలో మీరు ఫోటోలు-వీడియోలను అలాగే డాక్యుమెంట్ ఫైళ్ళను, ఆడియో-వీడియో కాలింగ్ కూడా చేసుకోవచ్చు. కానీ వాట్సాప్  స్టేటస్ ఫీచర్ టెలిగ్రామ్‌లో లేదు. కొన్ని రోజుల క్రితం వాట్సాప్‌లో ప్రారంభమైన యుపిఐ పేమెంట్ సౌకర్యం కూడా టెలిగ్రామ్‌లో లేదు. 

టెలిగ్రామ్ కూడా వాట్సాప్ లాగానే ఎండ్-టు-ఎండ్ ఎన్ క్రిప్షన్ చేయబడింది, అంటే మీ మెసేజెస్, కాల్స్ మొదలైనవి ఎవరూ చూడలేరు లేదా వినలేరు, హాక్ చేయలేరు. టెలిగ్రామ్ మీ మొబైల్ నంబర్, కాంటాక్ట్ లిస్ట్ మాత్రమే మీ నుండి డేటాగా తీసుకుంటుంది. టెలిగ్రామ్ అతిపెద్ద ఫీచర్ ఏమిటంటే మీరు దీనిలో 1.5జి‌బి  వరకు ఫైళ్ళను షేర్ చేసుకోవచ్చు, స్వీకరించవచ్చు.

వాట్సాప్  కొత్త విధానం ఫిబ్రవరి 8 నుండి అమల్లోకి రానుంది, దీని ప్రకారం ఇది వినియోగదారుల డేటాను దాని మాతృ సంస్థ ఫేస్ బుక్ తో పంచుకుంటుంది. అయితే వాట్సాప్ చేసిన స్పష్టీకరణలో వినియోగదారులందరూ ఈ  కొత్త పాలసీని అంగీకరించాల్సి ఉంటుంది  లేదంటే వారి వాట్సాప్  అక్కౌంట్ తొలగించబడుతుంది. మరోవైపు వాట్సాప్  ప్రైవేట్ చాట్, కాల్‌లు పూర్తిగా సురక్షితమని, ప్రైవేట్ ఖాతా సమాచారం ఫేస్‌బుక్‌తో భాగస్వామ్యం చేయదని స్పష్టం చేసింది.