Asianet News TeluguAsianet News Telugu

హువావేపై బ్యాన్: పట్టు కోసం రియల్ మీ+ఒప్పో అండ్ శామ్‌సంగ్‍

హువావేపై అమెరికా విధించిన నిషేధాన్ని ఇతర స్మార్ట్ ఫోన్ సంస్థలు ఒప్పో, రియల్ మీలతోపాటు దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్, ఆపిల్ సంస్థలు సొమ్ము చేసుకునే అవకాశాలు మెండుగా కనిపిస్తున్నాయి. 

Smaller rivals may gain in India at Huawei's cost
Author
New Delhi, First Published May 27, 2019, 11:06 AM IST

న్యూఢిల్లీ: అమెరికా నిషేధం విధించడంతో హువావేపై భారత మార్కెట్‌లో పట్టు కోసం ఎదురు చూస్తున్న చైనా స్మార్ట్ ఫోన్ సంస్థలకు ఒక అవకాశం లభించింది. ప్రత్యేకించి ఒప్పో, రియల్ మీ వంటి సంస్థలు ఇండియాలో తమ మార్కెట్ పెంచుకోవడానికి వీలు కలిగిస్తోంది. 

ఇప్పటికే ‘ఒప్పో’ బ్రాండ్ స్మార్ట్ ఫోన్లు రూ.30 వేల పై చిలుకు సెగ్మెంట్‌లో పట్టు సాధించేందుకు ప్రయత్నిస్తోంది. తాజాగా రెనో మోడల్ ఫోన్ ఆవిష్కరించేందుకు సిద్ధమవుతోంది ‘ఒప్పో’. మరో సంస్థ రియల్ మీ ఈ ఏడాది చివరిలో భారత విపణిలో పట్టు సాధించే దిశగా చర్యలు చేపడతామని చెబుతోంది. 

హువావేపై అమెరికా నిషేధం నేపథ్యంలో ఆ దేశం నుంచే సేవలందిస్తున్న గూగుల్ తన ద్వారా ఆండ్రాయిడ్ సేవలు హువావేకు అందవని తేల్చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి నిషేధం తాత్కాలికంగా నిలిపివేసినా.. అమెరికా - చైనా మధ్య వాణిజ్య యుద్ధంలో మళ్లీ మూడు నెలల తర్వాత అమలులోకి రానున్నది. 

ఈ నిషేధాన్ని తమకు అనుకూలంగా మార్చుకునేందుకు హువావేతో ఏర్పడిన గ్యాప్‌ను చైనా స్మార్ట్ ఫోన్ల సంస్థలు రియల్ మీ, ఒప్పో సొమ్ము చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాయి. వీటితోపాటు ఇతర టెలిఫోన్ సంస్థలు వన్ ప్లస్, ఆపిల్ సహా దక్షిణ కొరియా మేజర్ శామ్‌సంగ్‌తోపాటు ఈ పోటీలో పడుతున్నాయి. 

ప్రీమియం స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌లో గతేడాది డిసెంబర్ నెలాఖరు నాటికి 10 శాతం పెంచుకుని ఫోన్ సేల్స్ రెట్టింపు చేసుకున్నాయని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ తెలిపింది. హువావే పరోక్షంలో ఇతర సంస్థలు కొంత ఉపశమనం పొందే అవకాశం ఉంటుందని కౌంటర్ పాయింట్ రీసెర్చ్ అసోసియేట్ డైరెక్టర్ తరుణ్ పాథక్ చెప్పారు. 

రియల్ మీ ఇండియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (సీఈఓ) మాధవ్ సేథ్ కూడా భారతదేశ విపణిలోకి ప్రత్యేకించి ప్రీమియం సెగ్మెంట్‌లో అడుగు పెట్టాలని ప్రణాళిక సిద్ధం చేశామని ధ్రువీకరించారు. భారత మార్కెట్లో ప్రతి విభాగంలోనూ ఎదుగుదలకు భారీ స్కోప్ ఉన్నదన్నారు. ఈ ఏడాది చివరిలో ప్రీమియం మోడల్ ఫోన్ విపణిలోకి విడుదల చేస్తామని మాధవ్ సేథ్ తెలిపారు. 

భారత విపణిలో ఒప్పో, రియల్ మీ సంస్థలు టాప్ 5లో ఉన్నయి. ఈ రెండు ఫోన్ల సంస్థలను బీబీకే ఎలక్ట్రానిక్స్ నిర్వహిస్తోంది. వీటితోపాటు వివో సంస్థ ఉత్పత్తులు బీబీకే ఎలక్ట్రానిక్స్‌లో లభిస్తాయి. 2018 ఏప్రిల్ -డిసెంబర్ తర్వాత గత మార్చితో ముగిసిన త్రైమాసికంలో వన్ ప్లస్ మోడల్ కారు దేశంలోని అతిపెద్ద ప్రీమియం బ్రాండ్‌గా వన్ ప్లస్ నిలిచింది. కానీ గత మార్చి తైమాసికంలో శామ్‌సంగ్ మొదటి స్థానాన్ని చేజిక్కించుకున్నది. 

Follow Us:
Download App:
  • android
  • ios