మీకు శామ్‌సంగ్ స్మార్ట్‌ఫోన్స్  అంటే ఇష్టమా.. అధిక ధర కారణంగా మీరు వాటిని కొనలేకపోతున్నారా.. అయితే ఈ వార్త మీకు ఒక గుడ్ న్యూస్ లాంటిది. శామ్‌సంగ్ ప్రీమియం స్మార్ట్‌ఫోన్ గెలాక్సీ ఎస్ 20+ బిటిఎస్ ఎడిషన్ ధరను రూ.10వేలు తగ్గించారు. ఈ ఫోన్ ఫీచర్స్ గెలాక్సీ ఎస్ 20+ పోలి ఉంటాయి.  

శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20+ బిటిఎస్ ఎడిషన్ ధర: శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20+ బిటిఎస్ ఎడిషన్‌ను ఇప్పుడు రూ .77,999కు కొనుగోలు చేయవచ్చు. ఈ ఫోన్‌ను ఈ ఏడాది జూలైలో భారతదేశంలో లాంచ్ చేశారు. ఈ ఎడిషన్ దక్షిణ కొరియా పాప్ సింగర్ నుండి ప్రేరణ పొందింది. దీని ఫీచర్స్ శామ్‌సంగ్ గెలాక్సీ ఎస్ 20+ పోలి ఉంటాయి. కేవలం లోగో మాత్రమే తేడా.  

also read దసరా, దీపావళి ఫెస్టివల్ సేల్ లో ప్రజలు ఎక్కువగా ఏం ఆర్డర్ చేశారో తెలుసా.. ...

గెలాక్సీ ఎస్ 20+ బిటిఎస్ ఎడిషన్ స్పెసిఫికేషన్: 1,440x3,200 పిక్సెల్‌ల రిజల్యూషన్, 6.7-అంగుళాల క్వాడ్ హెచ్‌డి ప్లస్ డైనమిక్ అమోల్డ్ 2 ఎక్స్ డిస్‌ప్లే, మెరుగైన పనితీరు కోసం 12 జిబి ర్యామ్, 128 జిబి స్టోరేజ్ అందించారు. ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 10 ఆపరేటింగ్ సిస్టమ్‌లో పనిచేస్తుంది.

గెలాక్సీ ఎస్ 20 + బిటిఎస్ ఎడిషన్ కెమెరా: కెమెరా గురించి చెప్పాలంటే 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 12 మెగాపిక్సెల్ కెమెరా, 12 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్  కెమెరాతో క్వాడ్ కెమెరా సెటప్, 10 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా, 25w ఫాస్ట్ ఛార్జింగ్, 4500 mAh బ్యాటరీ, వైర్‌లెస్ ఛార్జింగ్‌ సపోర్ట్ తో వస్తుంది.