న్యూఢిల్లీ: దక్షిణ కొరియా స్మార్ట్ ఫోన్ల దిగ్గజం శామ్‌సంగ్ తమ వినియోగదారులకు శుభవార్త అందించింది. సరికొత్త ఫీచర్లతో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేయనున్నట్లు కంపెనీ పేర్కొంది. భారత మార్కెట్‌లో జూన్ 8న లేదా జూన్ 9న శాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను ప్రవేశపెట్టనున్నట్లు కంపెనీ తెలిపింది. 

శామ్‌సంగ్  గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ ధర రూ. 40,000 నుంచి రూ. 50 వేలల్లో అందుబాటులో ఉంటుందని సంస్థ వెల్లడించింది. ఢిల్లీ, ముంబై, హైదరాబాద్, బెంగళూరు, కోల్‌కతాలో శామ్‌సంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేస్తారు. గత నెలలో థాయిలాండ్ ‌మార్కెట్‌లో శాంసంగ్ గెలాక్సీ ఏ80 స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసినట్లు కంపెనీ వెల్లడించింది.

శామ్‌సంగ్ గెలాక్సీ ఎ 80 ఫోన్ల ఆవిష్కరణలకు హాజరయ్యే వినియోగదారులు తమ పేర్లు శామ్‌సంగ్ యాప్ ద్వారా పేర్లు నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. శామ్‌సంగ్ గెలాక్సీ ఎ80 స్మార్ట్ ఫోన్ ప్రత్యేకత రొటేటింగ్ ట్రిపుల్ కెమెరా సిస్టంతోపాటు ఫుల్ స్క్రీన్ డిస్ ప్లే ఉండటమే. ఈ ఫోన్ ఏంజిల్ గోల్డ్, ఘోస్ట్ వైట్, ఫాంటోమ్ బ్లాక్ కలర్ వేరియంట్లలో లభిస్తుంది.