Asianet News TeluguAsianet News Telugu

హైదరాబాద్‌లో జియోమార్ట్ సేవలు.. అదిరిపోయే డిస్కౌంట్లు కూడా

 రిలయన్స్‌ జియో తన ఈ-కామర్స్‌ పోర్టల్‌ జియోమార్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. నెలల తరబడి పరీక్షించిన అనంతరం వెబ్‌సైట్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఆర్డర్లను తీసుకొంటోంది కూడా. 

Reliance launches JioMart services across major Indian cities
Author
Hyderabad, First Published May 24, 2020, 11:32 AM IST


ముంబై: రిలయన్స్‌ జియో తన ఈ-కామర్స్‌ పోర్టల్‌ జియోమార్ట్‌ను వినియోగదారులకు అందుబాటులోకి తీసుకు వచ్చింది. నెలల తరబడి పరీక్షించిన అనంతరం వెబ్‌సైట్‌ను వినియోగదారులకు అందుబాటులో ఉంచింది. ఇప్పటికే పలు ప్రాంతాల నుంచి ఆర్డర్లను తీసుకొంటోంది కూడా. 

ఎంపిక చేసిన ఉత్పత్తులపై గరిష్ఠ చిల్లర ధర (ఎంఆర్‌పీ)లో కనీసం 5శాతం డిస్కౌంట్‌ను ఆఫర్‌ చేస్తున్నట్లు జియోమార్ట్ పోర్టల్‌ చెబుతోంది. నిత్యావసర వస్తువులతోపాటు వ్యవసాయ ఉత్పత్తులను కూడా అందిస్తోంది. 

కంపెనీ అందించిన సమాచారం ప్రకారం.. వ్యవసాయ ఉత్పత్తులను తమతో భాగస్వామ్యం కుదుర్చుకున్న రైతుల నుంచే నేరుగా సేకరిస్తున్నట్లు తెలిపింది.జియోమార్ట్‌ కోసం వాట్సప్‌తో ఒక వాణిజ్య ఒప్పందంపై సంతకాలు చేసినట్లు జియో తెలిపింది.

రిలయన్స్‌ జియో ఫ్లాట్ ఫామ్స్‌లో వాట్సప్‌ మాతృ సంస్థ ఫేస్‌బుక్‌ ఇటీవలే షేర్లను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. భారత్‌లోని చిన్న కిరాణా నెట్‌వర్క్‌ స్టోర్లను చేరుకోవడం కోసం జియోమార్ట్‌ ఈ టెక్నాలజీని వినియోగిస్తోంది.

also read:క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే సరి కొత్త కాంటాక్ట్స్ యాడ్

ఇప్పటికే జియోమార్ట్‌ తన కొనుగోలుదార్లు వాట్సాప్‌ ద్వారా ఆర్డర్లు పెట్టడానికి వీలుగా ఒక ఫీచర్‌ను తీసుకొచ్చింది. ప్రస్తుతానికి నవీ ముంబయి, ఠానే, కల్యాణ్‌ వంటి ఎంపిక చేసిన ప్రాంతాలకే దీనిని పరిమితం చేసింది. త్వరలోనే దేశంలోని ఇతర ప్రాంతాలకూ విస్తరించనుంది.

గత నెల 23వ తేదీన ఫేస్ బుక్ సంస్థకు 9.99 శాతం వాటాను జియో ఫ్లాట్ ఫామ్ విక్రయించింది. దీనికి అనుగుణంగా రిలయన్స్ జియో నిర్వహించే ఈ-కామర్స్ బిజినెస్‌కు వాట్సాప్ ద్వారా పూర్తి సహకారం అందించాలన్నది రెండు సంస్థల ఒప్పందంలో భాగం. వాట్సాప్ నుంచి మెసేజ్ పంపిన వారికి జియోమార్ట్ అవసరమైన వస్తువులు, సరుకులు సరఫరా చేస్తూ ఉంటుంది. 
 

Follow Us:
Download App:
  • android
  • ios