న్యూఢిల్లీ: మే నెలలో పలు స్మార్ట్ ఫోన్లు వాటి ధరలు తగ్గించాయి. ఒకవేళ మీరు కొత్త ఫోన్ కోసం ఎదురు చూస్తున్నారా? మీకు ఇష్టమైన ఫోన్ బ్రాండ్ ఏదో తేల్చుకుంటే సరి. అందులో బడ్జెట్‌కు సరిపడే ఫోన్ కొనుగోలు చేయొచ్చు.

భారతదేశ వ్యాప్తంగా ఒప్పో ఎ7, ఒప్పో ఆర్ 17 ప్రో, వివో వై 95, శామ్‌సంగ్ గెలాక్సీ ఎ9 (2018), శామ్ సంగ్ గెలాక్సీ ఎ20, శామ్ సంగ్ గెలాక్సీ ఏ30, వివో వీ 15 ప్రో, ఒప్పో ఎఫ్11 ప్రో తదితర మోడల్ ఫోన్లు ఉన్నాయి. వాటి వివరాలను ఒక్కసారి పరిశీలిద్దాం... 

పొకో ఎఫ్1 మోడల్ కారు 6జీబీ రామ్ ప్లస్ 128 జీబీ స్టోరేజీ ఆప్షన్ కలిగి ఉంటుంది. ముందుగా దీని ధర రూ.22,999 కాగా, ఇప్పుడు రూ.20 వేలకు లభిస్తున్నది. ఈ నెలలోనే దాని ధర 22,999 నుంచి రూ.20 వేలకు తగ్గించి వేసింది. 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ కారు ధర 23,999. కానీ రూ.22,999లకు తగ్గించారు. తాజాగా రూ.20 వేలకు తగ్గించి వేశారు. స్టీల్ బ్లూ, గ్రాఫైట్ బ్లాక్, రోస్సో రెడ్ కలర్స్‌లో లభిస్తుంది. 

అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ఎం1, జెన్ ఫోన్ లైట్ ఎల్ ధరల్లో రూ.2000 తగ్గింపు
అసుస్ జెన్ ఫోన్ మ్యాక్ ఎం1 ఫోన్ లాంచింగ్ చేసినప్పటి ధర ధర రూ.8999 నుంచి రూ.6999కి తగ్గించింది. మరోవైపు అసుస్ జెన్ ఫోన్ లైట్ ఎల్1 ఫోన్ ధర రూ.6,999 నుంచి రూ.4999లకు తగ్గించారు. ఈ రెండు ఫోన్లు ఫ్లిప్ కార్ట్ లో లభిస్తాయి. 

ఇటీవలే శామ్ సంగ్ విపణిలోకి విడుదల చేసిన గెలాక్సీ ఏ సిరీస్ ఫోన్ల్ ‘ఎ10’, ‘ఎ20’, ‘ఎ30’ ఫోన్లపై సగటున రూ.1,500 ధరలు తగ్గించి వేసింది. శామ్ సంగ్ గెలాక్సీ ఎ10 ఫోన్ ధర రూ.7,900, ఎ20, ఎ30 ఫోన్లు రూ.15,390లు లభిస్తాయి. 

శామ్ సంగ్ గెలాక్సీ ఎ 10 మోడల్ ఫోన్ ధర రూ.8490 నుంచి రూ.7990కి తగ్గించి వేశారు. గెలాక్సీ ఎ 20 ఫోన్ రూ.12,490 నుంచి రూ.11,490కి, గెలాక్సీ ఎ30 ఫోన్ రూ.16,990 నుంచి రూ.15,490కి తగ్గించి వేసింది. శ్యామ్ సంగ్ గెలాక్సీ ఎ9 మోడల్ 8జీబీప్లస్ 128 జీబీ రామ్ ధర రూ.31,990 నుంచి రూ.28,990 లకు లభిస్తుంది. 

శామ్ సంగ్ గెలాక్సీ ఎ7 మోడల్ 6జీ ప్లస్ 64 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.18,990 నుంచి రూ.15,990లకు, 6జీబీ ప్లస్ 128 జీబీ మోడల్ ధర రూ.22,990 నుంచి రూ.19,990లకు లభిస్తోంది. ఈ ఫోన్ లాంచింగ్ ధర 23,990

ఇక ఒప్పో ఎఫ్11 ప్రో 64 జీబీ వేరియంట్ ఫోన్ ధర రూ.22,990 నుంచి రూ.20,370కు తగ్గించి వేయగా, ఒప్పో ఎఫ్ 11 6జీబీ రామ్ ప్లస్ 64 జీబీ స్టోరేజీ ఫోన్ ధర రూ.24,990 నుంచి రూ.17,169లకు తగ్గించింది. ఇంకా ఒప్పో ఆర్17 ప్రో, ఒప్పో ఎ7, ఒప్పో ఎ3ఎస్ మోడల్ ఫోన్ల ధరలపైనా భారీ రాయితీలు అందుబాటులో ఉన్నాయి. 

ఇంకా వీవో వీ 15 ఫోన్ ధర 23,990 నుంచి రూ.4000 తగ్గించారు. తొలుత రూ.21,990గా నిర్ణయించి తర్వాత రూ.2000 ధర పెంచారు. ఈ ఫోన్ వివో ఈ స్టోర్, ప్లిప్ కార్ట్, అమెజాన్ స్టోర్లలో అందుబాటులో ఉంటాయి. 128 జీబీ ఇన్ బిల్ట్ వీవో వీ 15 ప్రో ధర రూ.2000 తగ్గించి రూ.26,990లకు అందుబాటులోకి తెచ్చారు.