చైనా స్మార్ట్‌ఫోన్ల తయారీ సంస్థ ఒప్పో.. హైదరాబాద్‌లో నెలకొల్పిన పరిశోధన, అభివృద్ధి (ఆర్‌అండ్‌డీ) కేంద్రం 5జీ సొల్యూషన్స్‌పై పనిచేస్తున్నది. గ్లోబల్ మార్కెట్‌లో సంస్థ 5జీ కార్యకలాపాలపైనా పరిశోధనలు సాగుతున్నాయి. ఇండియా-స్పెసిఫిక్ మొబైల్ ఫోన్ సొల్యూషన్స్, ప్రోడక్ట్స్‌పైనా పరిశోధనలు నడుస్తున్నాయని ఒప్పో మొబైల్ ఇండియా ఆర్‌అండ్‌డీ విభాగం అధిపతి, ఉపాధ్యక్షుడు తస్లీం ఆరిఫ్ చెప్పారు.

హైదరాబాద్ సెంటర్‌లో ప్రస్తుతం 150 మంది పనిచేస్తున్నారని, వ్యాపారావకాశాల ఆధారంగా వచ్చే  మూడేళ్లలో ఈ సంఖ్యను రెట్టింపు చేస్తామని ఒప్పో మొబైల్ ఇండియా ఆర్‌అండ్‌డీ విభాగం అధిపతి, ఉపాధ్యక్షుడు తస్లీం ఆరిఫ్ తెలిపారు. భారత్.. వేగంగా అభివృద్ధి చెందుతున్న మార్కెట్. ఇండియా మార్కెట్‌లో అగ్ర స్థానానికి ఎదుగాలన్న దిశగా పయనిస్తున్నామన్నారు.

ఈ క్రమంలోనే వినియోగదారుల అవసరాలు, అభిరుచులకు అనుగుణంగా సరికొత్త శ్రేణిలో మొబైల్స్‌ను మార్కెట్‌కు పరిచయం చేసేందుకు కృషి చేస్తున్నాం అని ఒప్పో మొబైల్ ఇండియా ఆర్‌అండ్‌డీ విభాగం అధిపతి, ఉపాధ్యక్షుడు తస్లీం ఆరిఫ్ పీటీఐకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చెప్పారు. ఇండియా స్పెసిఫిక్ ఉత్పత్తులతోపాటు అంతర్జాతీయ మార్కెట్ అవసరాలపైనా హైదరాబాద్ ఫెసిలిటీ సెంటర్ ద్రుష్టి సారిస్తుందని తెలిపారు. 

గతేడాది డిసెంబర్‌లో హైదరాబాద్‌లో భారతదేశంలోనే తమ తొలి ఆర్‌అండ్‌డీ సెంటర్‌ను ఒప్పో ప్రారంభించిన సంగతి తెలిసిందే. హైటెక్ సిటీలో ఉన్న ఈ కేంద్రం.. చైనాలో కాకుండా విదేశాల్లో ఉన్న వాటిలోకెల్లా అతిపెద్దది కావడం గమనార్హం. గతేడాది ప్రకటించిన 1.4 బిలియన్ డాలర్ల పెట్టుబడుల్లో భాగంగా దీన్ని ఒప్పో ఇక్కడ ఏర్పాటు చేసింది.

స్మార్ట్‌ఫోన్ల వినియోగంలో చైనా తర్వాతి స్థానంలో ఉన్న భారత్‌లో ఇతర ప్రత్యర్థి సంస్థలకు ఒప్పో గట్టి పోటీనే ఇస్తున్నది. దేశంలో 85 శాతం మంది 250 డాలర్ల కంటే తక్కువ విలువైన ఫోన్లను మాత్రమే వాడుతున్నారని, దాదాపు ఐదు శాతం మంది 500-700 డాలర్ల శ్రేణిలోని ఫోన్లను వినియోగిస్తున్నారని ఆరిఫ్ చెప్పారు. 

దీంతో మెజారిటీ యూజర్లను లక్ష్యంగా చేసుకుని వ్యాపారాన్ని విస్తరిస్తున్నట్లు తెలిపారు. అలాగే కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డిజిటల్ ఇండియా ఇన్సియేటివ్ లోనూ భాగస్వామిగా ఉన్నామని అరిఫ్ చెప్పారు. స్టార్టప్, సర్వీస్ ప్రొవైడర్లు, ఇన్ఫోసిస్టం ప్రొవైడర్లతోనూ కలిసి పని చేస్తామని చెప్పారు.