Asianet News TeluguAsianet News Telugu

ఒప్పో ఏ55 - అద్భుతమైన లుక్‌లతో ఈ కొత్త స్లిమ్ కాంపాక్ట్ ఒక ఫుల్ ప్యాకేజీ స్మార్ట్ ఫోన్

ఒప్పో విడుదల చేసిన బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లలో ఒప్పో ఏ55 ఒకటి

బ్యాటరీ అయిపోతుందనే భయం అవసరం లేదు, 18W ఫాస్ట్ ఛార్జ్ ద్వారా నిమిషాల్లోనే ఫుల్ ఛార్జ్

50ఎం‌పి ఏ‌ఐ ట్రిపుల్ కెమెరా, 64జి‌బి, 128జి‌బి వేరియంట్లో లభిస్తుంది

 

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package
Author
Hyderabad, First Published Oct 5, 2021, 5:44 PM IST

ఒప్పో ఏ55 అనేది కంపెనీ ఏ- సిరీస్ లైనప్‌ స్మార్ట్‌ఫోన్స్ లో సరికొత్త బడ్జెట్ మొబైల్ ఫోన్. మీరు స్టైలిష్ ఫీచర్ ప్యాక్డ్ స్మార్ట్‌ఫోన్ కోసం చూస్తున్నట్లయితే ఈ  హ్యాండ్‌సెట్ ఒక లేటెస్ట్ డిజైన్‌తో  మీకు మరింత విలువైనదిగా చేస్తుంది. ఈ ఒప్పో ఏ55 బెజెల్ లెస్  ఐ‌పి‌ఎస్ ఎల్‌సి‌డి డిస్‌ప్లే, 5000mAh బ్యాటరీతో  వస్తుంది, అలాగే 50ఎం‌పి ఏ‌ఐ ట్రిపుల్ కెమెరా కూడా ఇచ్చారు. స్టోరేజ్ కోసం మీరు 64జి‌బి  ఇంకా 128జి‌బి వేరియంట్‌ల నుండి దేనినైనా ఎంచుకోవచ్చు  ఇంకా మైక్రో ఎస్‌డి కార్డ్‌  సహాయంతో 256జి‌బి  వరకు కూడా స్టోరేజ్ పెంఛుకోవచ్చు.

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

ప్రస్తుతం ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలుకు అందుబాటులో ఉంది, వినియోగదారులకు ఈ స్మార్ట్ ఫోన్ ఎందుకు సరైన ఫోన్ అని చెబుతున్నందుకు మేము సంతోషిస్తున్నాము..

మొదట ఒప్పో ఏ55  లూక్స్ ఇంకా డిజైన్‌తో ప్రారంభిద్దాం. ఈ స్మార్ట్ ఫోన్ 8.4 ఎం‌ఎం స్మూత్   అండ్ స్లిమ్ డిజైన్‌, కేవలం 193 గ్రా బరువుతో వస్తుంది. మీరు పర్ఫెక్ట్  సైజ్ 16.55 సెం.మీ పంచ్-హోల్ ఎల్‌సి‌డి డిస్‌ప్లే (60Hz రిఫ్రెష్) పొందుతారు. అలాగే  ఆల్-డే ఐ కేర్‌తో అప్‌గ్రేడ్ కూడా ఇచ్చారు, దీనివల వినియోగదారుడి కళ్ళపై  ఎక్కువ ఒత్తిడి ఉండదు. 89.2% స్క్రీన్-టు-బాడీ రేషియో ఫోన్‌కు  ముందు నుండి చూడడానికి అల్ట్రా మోడర్న్ లుక్ ఇస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ తో ఒప్పో రెయిన్‌బో బ్లూ, స్టార్రీ బ్లాక్ అనే రెండు ట్రెండ్‌సెట్టింగ్ రంగులను కూడా ప్రవేశపెట్టింది.

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

సూపర్ పవర్ సేవింగ్ మోడ్ తో 5000mAh బ్యాటరీని అందించారు. అలాగే ఆప్టిమైజ్ నైట్ ఛార్జింగ్ వల్ల మీ బ్యాటరీ త్వరగా అయిపోదు. దీని 18W ఫాస్ట్ ఛార్జ్ సపోర్ట్ తో బ్యాటరీ లెవెల్ తగ్గినప్పుడు ఫోన్ మళ్లీ చార్జ్ అయ్యే వరకు మీరు ఎక్కువ సమయం వేచి ఉండాల్సిన అవసరం ఉండదు. వావ్! ఇది నిజంగా నాకు వ్యక్తిగతంగా బాగా నచ్చిన విషయం.

కెమెరా విషయానికొస్తే ఒప్పో వినియోగదారుల అవసరాలలో కూడా జాగ్రత్త వహించింది.  ఈ స్మార్ట్ ఫోన్ వెనక వైపు  మీకు ట్రూ 50ఎం‌పి ఏ‌ఐ ట్రిపుల్ కెమెరా, 2ఎం‌పి బొకే కెమెరా, 2ఎం‌పి మాక్రో కెమెరా లభిస్తుంది. పిక్సెల్-బిన్నింగ్ టెక్నాలజీతో  వినియోగదారులు మెమరీని కాపాడుకోవడానికి 12.5ఎం‌పి ఫోటోలకు మారవచ్చు.  పోర్ట్రెయిట్‌ ఫోటోల కోసం ఒప్పో అడ్వాన్స్డ్ అల్గోరిథంలు ఎన్విరాన్మెంట్ డెప్త్ గుర్తించి ఫోటోలకు మరింత ఎక్కువ న్యాచురల్ లుక్  ఇస్తాయి. బ్యాక్‌లిట్ హెచ్‌డి‌ఆర్ ని ఉపయోగించడానికి నైట్ మోడ్ యూజర్లకు అనుమతిస్తుంది దీనివల్ల బ్యాక్‌లిట్ షాట్‌లు లేదా తక్కువ లైట్ లో  ఎక్స్‌పోజర్ పెంచుతుంది.

ఆగండి, ఆగండి ... ఏ55 అందించేది బ్యాక్ కెమెరా ఒకటే కాదు. 16ఎం‌పి  సెల్ఫీ కెమెరాతో కూడా వస్తుంది. దీని 360° ఫిల్ లైట్ అనే సరికొత్త ఫీచర్‌తో తక్కువ వెలుతురులో కూడా స్పష్టమైన సెల్ఫీలను తీయడానికి వీలు కల్పిస్తుంది. ఒప్పో ఏ‌ఐ బ్యూటిఫికేషన్ మరింత న్యాచురల్ గా కనిపించే పోర్ట్రెయిట్‌ల కోసం  వినియోగదారులకు బ్యూటీ లెవెల్ అడ్జస్ట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది.

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

దీనికి అదనంగా ఒప్పో ఏ55లో 15 ఫోటో ఫిల్టర్‌లను అందించారు. ఈ ఫీచర్ 10 ఇంటర్నల్ వీడియో ఫిల్టర్‌లతో వీడియోలకు కూడా సపోర్ట్ చేస్తుంది. ఇది చాలా అత్భుతం..!

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

కెమెరా నుండి ఇప్పుడు పర్ఫర్మెంస్ గురించి మాట్లాడితే ఈ డివైజ్ రెండు వేరియంట్లలో వస్తుంది. ఒకటి 64జి‌బి+4జి‌బి మోడల్  మరొకటి 128జి‌బి+6జి‌బి మోడల్, రెండూ కూడా డ్యూయల్ సిమ్ సపోర్ట్‌తో వస్తాయి. ఒకవేళ  స్టోరేజ్‌ను పెంచాలనుకుంటే  మైక్రో ఎస్‌డి స్లాట్ ద్వారా 256జి‌బి వరకు సపోర్ట్ చేస్తుంది. ఒప్పో ఏ55 లోని మీడియాటెక్ హీలియో జి35 ఆక్టా-కోర్ ప్రాసెసర్ 2.3GHz వరకు వేగవంతం చేయగలదు ఇది వినియోగదారులకు గొప్ప అనుభవాన్ని హామీ ఇస్తుంది. ఈ హ్యాండ్‌సెట్‌లో నాకు బాగా నచ్చిన విషయం ఏమిటంటే సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ అన్‌లాక్‌ ఆప్షన్. మీరు అలా వొద్దనుకుంటే  కేవలం స్క్రీన్‌ను చూడవచ్చు అప్పుడు ఏ‌ఐ ఫేస్ అన్‌లాక్ మీ స్మార్ట్ ఫోన్ కి యాక్సెస్ ఇస్తుంది.


స్పష్టంగా చెప్పాలంటే, ఈ స్మార్ట్ ఫోన్ సాధారణంగా కనిపించే ఫోన్ కాదు.  కలర్‌ ఓఎస్ 11.1 లోని సిస్టమ్ బూస్టర్ ఒప్పో ఏ55 స్మూత్ గా పనిచేయడానికి అనుమతిస్తుంది. అలాగే ఆకట్టుకునే రెస్పాన్స్ రేటు 5%  పెంచుతుంది అయితే ఫ్రేమ్ రేటు స్థిరత్వం 6.9% పెరుగుతుంది. ఇందుకు కారణం ఐడిల్ టైమ్ ఆప్టిమైజర్, స్టోరేజ్ ఆప్టిమైజర్, ఫ్లెక్స్ డ్రాప్, త్రీ  ఫింగర్ ట్రాన్స్‌లేట్ గూగుల్ లెన్స్‌తో  ఇంకా యూ‌ఐ ఫస్ట్ 3.0 యూజర్‌లకు గొప్ప అనుభవాన్ని మాత్రమే  వారి స్మార్ట్‌ఫోన్‌లకు స్మార్ట్‌ను జోడిస్తుంది.

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

ఒప్పో ఏ55 ఫ్లాగ్-షిప్ అనుభవాన్ని అందిస్తుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఒప్పో ఏ55 రెండు వేరియంట్లలో లభిస్తుంది: 4జి‌బి+64జి‌బి వేరియంట్ 3 అక్టోబర్  రూ.15,490కే నుండి విక్రయించనున్నారు. 6జి‌బి+128జి‌బి అక్టోబర్ 11 నుండి అందుబాటులోకి వస్తుంది. దీనిని అమెజాన్‌, ఇతర రిటైలర్లలో ఆకర్షణీయమైన ధర రూ.17,490కే కొనుగోలు చేయవచ్చు. శక్తివంతమైన బ్యాటరీ, సూపర్‌ఫాస్ట్‌ ప్రాసెసర్ తో పెద్ద స్టోరేజ్‌ని అందించే లైట్ వెయిట్  ఫోన్ కోసం చూస్తున్నవారు దీనిని ఖచ్చితంగా పరిగణించవచ్చు.

అమెజాన్‌, ఆఫ్‌లైన్‌ లేదా ఇ-స్టోర్ లో ఒప్పో ఏ55 ఫోన్‌ను కొనుగోలు చేసేందుకు అద్భుతమైన ఆఫర్‌లతో  వస్తుంది

మీరు అమెజాన్ ద్వారా ఫోన్‌ను కొనుగోలు చేస్తే మీకు హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్ డెబిట్ / క్రెడిట్ కార్డ్ తో ఫ్లాట్ రూ.3,000 తగ్గింపు లభిస్తుంది. ఈ‌ఎం‌ఐ సౌకర్యం కూడా అందిస్తుంది. ఈ స్మార్ట్ ఫోన్ కొనుగోలు పై మీకు 3 నెలల ఉచిత అమెజాన్ ప్రైమ్ సబ్‌స్క్రిప్షన్ కూడా లభిస్తుంది. ప్రైమ్ సభ్యులకు 6 నెలల వరకు నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ, ఉచిత స్క్రీన్‌ రిప్లేస్మెంట్  పొందుతారు.

ఒప్పో ఈ స్టోర్ నుండి  కోటక్, బ్యాంక్ ఆఫ్ బరోడా, యాక్సిస్ బ్యాంక్ ద్వారా ఈ స్మార్ట్ ఫోన్ ని కొనుగోలు చేసే వినియోగదారులకు 10% ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. ఇంకా 3 నెలల వరకు నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ కూడా అందిస్తుంది.

OPPO A55 - This sleek compact newbie with striking looks is a complete package

ఇతర ప్రముఖ రిటైలర్ల నుండి సెలెక్టెడ్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ద్వారా  కొనుగోలు చేస్తే మీకు రూ.3వేల వరకు క్యాష్‌బ్యాక్,  3 నెలల వరకు నో కాస్ట్ ఈ‌ఎం‌ఐ పొందవచ్చు. ఈజీ బజాజ్ ఫిన్ సర్వ్, ఐ‌డి‌ఎఫ్‌సి ఫస్ట్ బ్యాంక్, హెచ్‌డి‌బి ఫైనాన్షియల్ సర్వీసెస్, టి‌వి‌ఎస్ క్రెడిట్, హెచ్‌డి‌ఎఫ్‌సి బ్యాంక్, కోటక్, ఐ‌సి‌ఐ‌సి‌ఐ బ్యాంక్ కస్టమర్ ఫైనాన్స్, హోమ్ క్రెడిట్, మహీంద్రా ఫైనాన్స్, జెస్ట్   నుండి  సులభమైన ఈ‌ఎం‌ఐ ఫైనాన్స్  కూడా లభిస్తుంది.

 

  

Follow Us:
Download App:
  • android
  • ios